TEJASWI: బిగ్ బాస్ బ్యూటీ కాలుకి ఏమైంది.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్

బుల్లితెర‌, వెండితెర‌పై సంద‌డి చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ముద్దుగుమ్మ తేజస్వి మ‌దివాడ‌. ఎప్పుడు గ్లామ‌ర్ షోతో సంద‌డి చూస్తూ ఉండే ఈ అమ్మ‌డు బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఈ షోతో మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన తేజ‌స్వీ దానిని స‌రిగ్గా క్యాష్ చేసుకోలేక‌పోయింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక లాఫ్టర్ చాలెంజ్ అంటూ బ్రహ్మానందంతో చేసిన షో వర్కవుట్ కాలేదు. ఇక సినిమా అవకాశాలు కూడా తగ్గిన తరుణంలోనే తేజస్వీకి మంచి ఆఫర్ వచ్చింది. క‌మిట్మెంట్ అనే సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

తేజ‌స్వీ త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌టనలే క‌మిట్మెంట్‌లో ఉంటాయ‌ని చెప్ప‌డంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తేజ‌స్వీ ఎప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంటుంది. కాని తాజాగా కాలుకి పెద్ద క‌ట్టు కట్టుకొని మంచంపై ప‌డుకొని ఉన్న ఫొటో షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇది చూసి నెటిజ‌న్స్ కంగారు ప‌డ్డారు. ఏమైంది, ఎలా గాయ‌మైంది అంటూ వ‌రుసగా కామెంట్స్ పెడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ తేజ‌స్వీ స్పందించ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నారు.

Advertisement