Tejaswi Madivada: ఆ అందాలతో ఎర.. తేజస్వీ బోల్డ్ పిక్ వైరల్
NQ Staff - January 26, 2021 / 11:20 AM IST

Tejaswi Madivada సోషల్ మీడియాలో తేజస్వీ మడివాడ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షో కంటే ముందు కొన్ని సినిమాల్లో కనిపించి మెప్పించింది. మరీ ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత బోల్డ్ పాత్రలకే పరిమితమైంది. ఐస్ క్రీం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాల్లోనూ తేజస్వీ మెరిసింది. అయితే వీటన్నింటి కంటే ఎక్కువగా బిగ్ బాస్ ద్వారానే క్రేజ్ వచ్చింది.
బిగ్ బాస్ షో ద్వారా తేజస్వీ ఎంత పాపులర్ అయిందో.. అంతే స్థాయిలో నెగెటివిటీని మూటగట్టుకుంది. అయితే ఆ నెగెటివిటీయే ఆమె కొంప ముంచింది. బిగ్ బాస్ ఇంట్లో ఆమె ప్రవర్తన, మాటతీరు, ఆ వస్త్రాధారణ ఇలా ప్రతీ ఒక్క విషయంలో తేజస్వికి ఎదురుదెబ్బ తగిలింది. చివరకు తేజస్వీకి బయటకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. చేసిన ఒక్క షో కూడా డిజాస్టర్‌గా మిగిలింది. అలా బిగ్ బాస్ తరువాత ఈ అమ్మడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

Tejaswi Madivada Bold Pic Viral
తేజస్వీ బోల్డ్ మూవీ.. Tejaswi Madivada
ఇక అవకాశాలేవీ రావడం లేదు కదా అని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని తేజస్వీ భావించిందట. ఆ సమయంలోనే కమిట్మెంట్ అనే సినిమా కథ తన వద్దకు వచ్చిందట. అది తన జీవితంలో జరిగిన ఘటనలే అని, ఇలా అందరికీ చెప్పే అవకాశం దేవుడే ఆ సినిమా రూపంలో ఇచ్చాడని అనుకుందట. కమిట్మెంట్ పేరుతో అమ్మాయిల మీద జరిగే ఘోరాలను అందులో చూపించనున్నారట. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.
అందాలతో ఎర..
కమిట్మెంట్ సినిమా కోసం తేజస్వి మరింత బోల్డ్‌గా కనిపించనుంది. ఈ మేరకు తేజస్వీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. బికినీ ఫోటోలు, ఎద అందాలను ప్రదర్శిస్తూ అందరినీ కట్టిపడేస్తుంటుంది. తాజాగా తేజస్వీ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో తొడ అందాలతో నెటిజన్లలో సెగలు రేపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.