Tejaswi: పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాల‌నుకున్న తేజ‌స్వి

Tejaswi: హాట్ బ్యూటీ తేజ‌స్వి ఐస్‌క్రీమ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన విష‌యం తెలిసిందే. చాలా బోల్డ్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత ‘లవర్స్‌’, ‘మనం’, ‘హార్ట్‌ ఎటాక్‌’ సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

తేజ‌స్వికి మ‌రింత పాపులారిటీని తీసుకొచ్చింది బిగ్ బాస్ షో. సీజ‌న్2లో పాల్గొన్న తేజ‌స్వి త‌న‌కున్న ఇమేజ్ ని కొంత డ్యామేజ్ చేసుకుంది. కౌశ‌ల్‌తో గొడ‌వ‌లు, సామ్రాట్‌తో ప్రేమ వ్య‌వ‌హారం వంటివి నడిపి త‌ర‌చు వార్త‌ల‌లో నిలుస్తూ ఉండేది ఈ ముద్దుగుమ్మ‌. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక చిన్నా చితకా టీవీ ప్రోగ్రాంస్ మాత్ర‌మే వ‌చ్చాయి త‌ప్ప సినిమాలు పెద్ద‌గా చేయ‌లేదు.

తేజ‌స్వి ఫేడ్ ఔట్ అవుతుండ‌డంతో ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాని ఎక్కువ‌గా న‌మ్ముకుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయ‌డ‌మే కాకుండా ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతూ ఉంటుంది. తాజ‌గా త‌న చిన్న‌ప్ప‌టి విష‌యం ఒక‌టి షేర్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

‘చిన్నప్పుడు పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు కదా..ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని రియలైజ్‌ అయ్యాను’ అంటూ పానీపూరి బండిని తోసుకెళ్తున్న ఫోటోను షేర్‌ చేసింది.ఈ ఫొటోపై నెటిజ‌న్స్ ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు.కొంప తీసి పానీ పూరి బండి పెడ‌తావా ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తేజ‌స్వి ఆ మ‌ధ్య ఓ వ్య‌క్తితో డేటింగ్ చేస్తున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇద్ద‌రు క‌లిసి చెట్టాప‌ట్టాలు వేస్తున్నార‌ని వీలున్న‌ప్ప్పుడ‌ల్లా విహార‌యాత్ర‌ల‌కు కూడా వెళుతుంటార‌ని కొంద‌రు గాసిప్ రాయుళ్లు చెప్పుకొచ్చారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ అయితే లేదు.