కాంప్రమైజ్‌లు, ‘కమిట్మెంట్‌’లు తప్పా ఇంకేం ఆలోచించరా : తేజస్వీ

NQ Staff - November 18, 2020 / 11:00 AM IST

కాంప్రమైజ్‌లు, ‘కమిట్మెంట్‌’లు తప్పా ఇంకేం ఆలోచించరా : తేజస్వీ

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ అందాల ఆరబోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజస్వీ చేసే హాట్ ఫోటో షూట్లు నెట్టింట్లో మంటలు రేపుతుంటాయి. అలాంటి తేజస్వీ ఇక వెబ్ సీరిస్‌లో ఎలాంటి హల్చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న తేజస్వీ కమిట్మెంట్ అప్డేట్ తాజాగా వచ్చింది. కమిట్మెంట్ టీజర్ గురించి ఐదారు రోజుల నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. హాట్ హాట్‌గా తేజస్వీ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ టీజర్ ‌పై హైప్ పెంచారు.

మొత్తానికి నేడు టీజర్ వచ్చేసింది. పోస్టర్‌లో చూపించినట్టుగానే బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంది. నలుగురు అమ్మాయిల కథ ఇది. ఏ రంగంలోనైనా సరే కమిట్మెంట్లు, మీటూ అనేవి ఉంటాయని చూపించే కథ ఇది అని తెలుస్తోంది. ఇక ఈ నలుగురు అమ్మాయిలు వాటిని ఎలా ఎదుర్కొన్నారు.. ఎలా లొంగిపోయారు.. చివరకు ఏం జరిగిందన్నదే కమిట్మెంట్ కథ అని తెలుస్తోంది. ఆ అందరిలోనూ తేజస్వీ పాత్రే మెయిన్ లీడ్‌గా ఉన్నట్టుంది.

సెక్స్‌లోంచే లైఫ్ పుడుతుంది.. అలాంటిది లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేంటి అంటూ కమిట్మెంట్‌ను అడిగే డైలాగ్‌ బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. ఇక టీజర్ చివర్లో తేజస్వీ చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గానే ఉంది. అమ్మాయిలు కనిపిస్తే చాలు.. కాంప్రమైజ్‌లు, కమిట్మెంట్లు తప్పా ఇంకేం ఆలోచించరా అని గొంతు చించుకుని అరిచింది. మొత్తానికి బోల్డ్ కంటెంట్‌ను నమ్ముకున్న ఈ కమిట్మెంట్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us