తాప్సీ కి ఇష్టంగానే ఉంది.. కానీ వాళ్ళే.. అంతిష్టంగా లేరా ..?

టాలీవుడ్ లో తాప్సీ మంచి సినిమాలు చేసింది. హిట్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. రవితేజ, వెంకటేష్, ప్రభాస్ మంచు మనోజ్ లాంటి హీరోల పక్కన నటించిన క్రేజ్ కూడా ఉంది. కానీ తాప్సీ టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో బాగా ఫేమస్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తాప్సీ కోసమే అన్నట్టుగా బాలీవుడ్ లో కథలు తయారు చేస్తున్నారు మేకర్స్. పింక్, బద్లా, జుడ్వా 2, ఘాజీ, మిషన్ మంగళ్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. చెప్పాలంటే బాలీవుడ్ లో తాప్సీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మేకర్స్ లక్కీ హీరోయిన్ గా మారింది.

Mission Mangal New Posters: A Day In The Life Of Scientists Akshay Kumar,  Vidya Balan, Taapsee Pannu, Sonakshi Sinha

ఆ కారణంగానే ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో 5 క్రేజీ ప్రాజె క్ట్స్ లో నటిస్తోంది. ఒక తమిళ ఉండటం విశేషం. అయితే తాప్సీకి బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా టాలీవుడ్ సినిమాలు చేయాలన్న తాపత్రయం తో ఉందట. కనీసం సంవత్సరంలో ఒక్క సినిమా అయినా తెలుగు సినిమా చేయాలని భావిస్తుందట. మొదట తాను తెలుగు సినిమాలు చేసే గుర్తింపు సాధించిందని ఎట్టి పరిస్థితుల్లోను తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకోవడం లేదని అంటోందట.

తాప్సీ మాటల కి చాలామంది అభినందిస్తున్నారని తెలుస్తోంది. చాలామంది హీరోయిన్స్ ముందు తెలుగు సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిన తర్వాత బాలీవుడ్ లో లేక కోలీవుడ్ లోనే అవకాశాలు అందుకొని సెటిలవుతారు. ఆ తర్వాత మొదట పాపులారిటీ వచ్చిన ఇండస్ట్రీని మర్చిపోతుంటారు. కాని తాప్సీ అలా కాకుండా బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తున్నా టాలీవుడ్ వైపు చూస్తూ ఇక్కడ నటించాలని కోరిక తో ఉందని చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ అట్ల కృతజ్ఞతతో ఉందన్న కారణంగా తాప్సీ ని పొగుడుతున్నారట. మరి తాప్సీ కి తెలుగు సినిమాలలో నటించాలన్న ఇష్టం బాగా ఉన్నప్పటికి ఇక్కడి మేకర్స్ కి తాప్సీ కి అవకాశాలు ఇవ్వాలన్న ఇష్టం ఉందా లేదా అన్నది కొంతమంది చర్చించుకుంటున్నారట.

Advertisement