Tammareddy Bharadwaj: మీ ఎమ్మేల్యేలు చ‌ర్చ‌కు సిద్ద‌మా.. మీ ఆస్తులు, మా వాళ్ల ఆస్తుల లెక్క తీద్ధామా..!

Tammareddy Bharadwaj: ఏపీ సినిమా టిక్కెట్ వ్య‌వ‌హారం ఇప్పుడు కులం వైపు ట‌ర్న్ తీసుకుంది. నేత‌ల‌కు, సినిమా వాళ్ల‌కు మ‌ధ్య జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బ‌లుపు అనే మాట‌లు వాడ‌డంతో నిర్మాత‌లు మండిప‌డుతున్నారు. తాజాగా తమ్మారెడ్డి రెచ్చిపోయారు.

Tammareddy Bharadwaj Fire on YSRCP Leaders
Tammareddy Bharadwaj Fire on YSRCP Leaders

‘ ఆ ఎమ్మెల్యే మాట్లాడిన దాంట్లో నాకు అర్ధం కానిది ఏంటంటే.. టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి సినిమా వాళ్లు డబ్బు సంపాదిస్తున్నారని అన్నాడు. పేదలకు న్యాయం చేస్తున్నాం అంటున్నాడు. అది నిజమే.. మేం తప్పు చేశాం.. ఇప్పుడు వాళ్లు ఆ తప్పుని సరిదిద్దుతారా? లేదా? నేను దొంగతనం చేస్తే చేయకూడదని చెప్పి దాన్ని సరిదిద్దడానికి చూడాలి తప్పితే.. చేశావ్ అని చెప్పడం వల్ల ఏం ఉపయోగం.

రెండోది.. ముఖ్యమంత్రి ఉన్నాడని మీకు గుర్తుందా? అంటున్నారు.. జగనే కాదు.. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా మాకు ముఖ్యమంత్రి ఉన్నాడని తెలియదు.. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవరైనా వెళ్లారా? చంద్రబాబుని కలిశారా? ఆయన ఉన్న ఐదేళ్లలో ఎవరైనా ఇండస్ట్రీ తరుపున వెళ్లి కలిశారా? లెక్కలు తీయమనండి.. ఎవరూ వెళ్లి కలవలేదు.. ఇప్పుడు వీళ్లకి ఎందుకంత అక్కసు? ఎందుకు వెళ్లి కలవాలి?

మూడోది ఏపీలో షూటింగ్‌లు చేస్తున్నారా? అంటున్నారు.. చంద్రబాబు కానీ.. జగన్ కానీ వీళ్లెవరూ అధికారంలోకి రాకముందు నుంచే.. 30 శాతం సినిమా షూటింగ్‌లు ఏపీలోనే చేస్తున్నాం.. వాళ్లకి ఈ విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. రాజమండ్రి, వైజాగ్, భీమిలిలో రెగ్యులర్ షూటింగ్‌లు ఉంటాయి. ఇవి కాకుండా వైజాగ్‌లోని రామానాయుడు స్టుడియోలో బెంగాలీ, ఒడియా షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి.

అసెంబ్లీని ఎట్టాగూ నాశనం చేశారు.. టీవీలను ఎందుకు నాశనం చేస్తున్నారు.. అన్నిపార్టీల వాళ్లు బూతులు తిట్టుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడే మాటలు ఇవేనా? సినిమా టికెట్‌ల లెక్కలు చెప్తున్నారు.. మరి జనం డబ్బుతో నడిపిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు ఎంత ఖర్చు అవుతుంది.

‘కమ్మకులంపై దొబ్బుదేలు ఉంటే కాల్చిపారదొబ్బండి అందర్నీ.. ఒకేసారి పోతారు.. తొక్కలోది 8 పర్సంట్ కూడా లేదు.. కాల్చిపారేయండి.. అందరూ ఒకేసారి పోతారు. మహా అయితే లక్షల్లోనే ఉంటారు.. వీళ్లతో రోజూ తిట్లు తినేకంటే.. ఒకేసారి పోవడం మంచిది కదా.. ఎందుకు రోజూ ఈ దరిద్రం’ అంటూ చెలరేగిపోయారు తమ్మారెడ్డి.

సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!? అంటూ ఆయన సవాల్ విసిరారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని భరద్వాజ అన్నారు.