Tamil Movies : సంక్రాంతి సినిమా.! తెలుగు నేలపై ‘అరవ సినిమాలు’ కష్టమే.!
NQ Staff - December 6, 2022 / 10:02 PM IST

Tamil Movies : సంక్రాంతి వచ్చేస్తోంది.. సంక్రాంతి అంటే సినిమాల పండగ కూడా.! రెండు పెద్ద సినిమాల డేట్లు ఖాయమైపోయాయి. చిరంజీవి ‘వాల్తేరు వీర్రాజు’, నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరోపక్క, డబ్బింగ్ సినిమాలు ‘వారిసు’, ‘తనివు’ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్న సంగతి తెలిసిందే.
వీటిల్లో ‘తనివు’ సినిమాతో ఎవరికీ పెద్దగా సమస్య లేదు. కానీ, ‘వారిసు’ విషయంలోనే అసలు తంటా. ఎందుకంటే, తెలుగు సినిమాలకంటే కూడా ‘వారిసు’కి ఎక్కువ థియేటర్లు కేటాయించేలా నిర్మాత దిల్ రాజు పావులు కదుపుతున్నారు మరి.!
‘వారిసు’కి ఆ ఛాన్సే లేదట…
‘వారిసు’ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడానికి ఎగ్జిబిటర్లు ఒప్పుకోవడంలేదు. తెలుగు సినిమాలకే సంక్రాంతికి ఎక్కువ క్రేజ్ వుంటుందన్నది ఎక్కడికక్కడ ఎగ్జిబిటర్ల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయంగా కనిపిస్తోంది.
దిల్ రాజు మాత్రం, అందుకు ఒప్పుకోవడంలేదు. ‘వారిసు’కి నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. విజయ్ సినిమాలకి తెలుగులో మార్కెట్ మరీ అంత ఎక్కువేమీ కాదు. కానీ, దిల్ రాజు మాత్రం అతి చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఉత్తరాంధ్ర ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. తెలుగు సినిమాల్ని దాటి, తమిళ సినిమాలకు మద్దతిచ్చేది లేదని చెబుతున్నారట. దాంతో, ఈ వివాదం ముదిరి పాకాన పడేలా కనిపిస్తోంది.