Cinema: రూ.750ల కోసం ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్‌లో ప‌ని చేసిన హీరో ఎవ‌రో తెలుసా?

Cinema: చాలా మంది జీవితాల‌లో బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అవుతుండ‌డం స‌హ‌జం. బాగా బ్ర‌తికిన వారు తిండి లేక ఇబ్బంది ప‌డ్డారు. ఒక‌ప్పుడు తిండి దొర‌క‌ని వారు నేడు కాస్ట్‌లీ కార్ల‌లో తిరుగుతూ విలాస‌వంత‌మైన జీవితం గడుపుతున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల‌లో క‌ష్ట‌ప‌డి పైకెదిగిన వారు చెప్పే మాట‌లు వింటే రోమాలు నిక్క‌పొడుచుకుంటాయి. తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి చెప్పిన మాట‌లు వింటే కూడా ఆయ‌న అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా షాకవ్వ‌కుండా ఉండ‌లేరు.

Cinema

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాడు. చేసే పాత్ర పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే సరైన న్యాయం చేస్తాడు. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తన టాలెంట్ ఏమిటో నటించి చూపిస్తున్నాడు. ఇటీవ‌ల వచ్చిన ఉప్పెన చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందాడు.

ఇక ఇప్పుడు సినిమాల‌తో పాటు త‌మిళ మాస్టర్ చెఫ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విజయ్ సేతుప‌తి.. ప్రోమోలో ఒక‌ప్పుడు త‌న ప‌రిస్థితుల గురించి వివ‌రించి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆకలిపై ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసినట్లు చెప్పిన ఆయ‌న సాయంత్రం 7గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు పని చేసినట్లు చెప్పాడు.

ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్‌లో ప‌ని చేయ‌డం వ‌ల‌న తిండితో పాటు డ‌బ్బు దొర‌కుతుండ‌డంతో చాలా రోజుల పాటు అందులోనే ప‌ని చేశాడ‌ట‌. కొద్ది రోజుల త‌ర్వాత టెలిఫోన్ బూత్‌లో ప‌ని చేసిన‌ట్టు పేర్కొన్నాడు విజ‌య్. ఇక త‌న‌కు ఉల్లి స‌మోసా అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన విజ‌య్ సేతుప‌తి ఇప్పుడు అది ఎక్క‌డా దొర‌క‌క‌పోవ‌డంతో ఇంట్లోనే చేసుకొని ఆ త‌ర్వాత ఒక క‌ప్పు కాఫీ తాగుతాన‌ని స్ప‌ష్టం చేశాడు.

విజ‌య్ సేతుపతి ఇటీవ‌ల మాస్ట‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇందులో స్టార్ హీరో విజయ్ కు విలన్ గా నటించిన విషయం తెలిసిందే. సేతుపతి వల్లనే తెలుగులో కూడా ఆ సినిమాకు భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. విజయ్ సేతుపతి చేతిలో ప్రస్తుతం పది ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి. లాక్ డౌన్ వలన చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయి. ఇక అతని కమిట్మెంట్స్ అయితే 20కి పైగానే ఉన్నాయి. ప్ర‌స్తుతం సేతుపతి ఒక్కో సినిమాకు 8 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు సమాచారం.