Mahesh Babu : రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో విలన్ గా విక్రమ్ నటించనున్నారా!

Mahesh Babu : టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిది స్పెషల్ స్టైల్. తనకు నచ్చిన హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. ప్రతి స్టార్ హీరోతో కవర్ చేయాలని అనుకోరు. రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో రెండేసి సినిమాలు చేశారు. మిగతా హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఈ క్రమంలో రాజమౌళికి ఉన్న కారణాలు ఆయనకు ఉన్నాయి. అలాగే ఈ స్టార్ హీరోలు మాత్రం రాజమౌళి సినిమా చేయాలని, తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

TheNewsQube-
Tamil Hero Vikram in Mahesh babu andi Rajamouli film
Tamil Hero Vikram in Mahesh babu andi Rajamouli film

ఈ క్రమంలోనే మహేష్ బాబుతో ఓ సరికొత్త సినిమాను రాజమౌళి ఖరారు చేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో కలిసి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది కానీ.. ఇద్దరూ బిజీ అవ్వడంతో కుదరలేదని అన్నారు. ఇక ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న కథ, జోనర్, నటీనటులపై ఎన్నో వార్తలు వచ్చాయి.

Tamil Hero Vikram in Mahesh babu andi Rajamouli film
Tamil Hero Vikram in Mahesh babu andi Rajamouli film

లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్నట్లు, ఆయన్ను కాంటాక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కథ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన స్టోరీ లైన్స్ ని మహేష్ పరిశీలిస్తున్నారట. అసలు మహేష్ సినిమాకి సంబంధించిన జోనర్, కథ విషయమే ఫైనల్ కానప్పుడు ఈ సినిమాకి విక్రమ్ విలన్ అని ఎలా డిసైడ్ చేస్తారని అంటున్నారు అభిమానులు. కనుక ఈ విషయంలో ఫిల్మ్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.