Surya Jai Bhim : హీరో సూర్య‌కు భారీ భ‌ద్ర‌త‌.. నివాసం వద్ద ఐదుగురు పోలీసులు

Surya Jai Bhim : వివాదాల‌కు చాలా దూరంగా ఉండే సూర్యని ఈ మ‌ధ్య ప‌లు వివాదాల‌లోకి లాగుతున్నారు. ఆకాశం నీ హ‌ద్దురా సినిమా స‌మ‌యంలోను సూర్య ప‌లు వివాదాల‌లో ఇరుక్కోగా, ఇప్పుడు జై భీమ్ చిత్రం కూడా సూర్య‌ని ఇబ్బంది పెడుతుంది. భారీ అంచనాల మధ్య ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తుంటే.. మరోవైపు అదే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.

TheNewsQube-
tamil hero surya jai bhim movie controversy
tamil hero surya jai bhim movie controversy

నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ ‘జై భీమ్’ చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది. దీని తరువాత సూర్యకు అనేక బెదిరింపులు రావడంతో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు.

tamil hero surya jai bhim movie controversy
tamil hero surya jai bhim movie controversy

ప్రస్తుతం తమిళనాడు, టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులు ఆయుధాలతో సూర్యకు భద్రతను ఇస్తున్నారు. కాగా ‘జై భీమ్‌’లోని కొన్ని సన్నివేశాలు వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ సంఘం సూర్య, ‘జై భీమ్’ చిత్రబృందం బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

tamil hero surya jai bhim movie controversy
tamil hero surya jai bhim movie controversy

వ‌న్నియార్‌ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు.

ఇదే వివాదంపై కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని.. అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం లేదని.. వివరణ ఇచ్చారు.

మరోపైపు పలువురు ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ మాత్రమే కాదు సినీ ప్ర‌ముఖులు కూడా సూర్య‌కి స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ చిత్రాన్ని సూర్య, జ్యోతిక 2డి ప్రొడక్షన్స్ పై నిర్మించారు. ఇరులార్ కమ్యూనిటీ సభ్యులకు కస్టడియల్ టార్చర్ గురించి ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు.