Shimbu : సినిమా కోసం 27 కేజీల బ‌రువు త‌గ్గాడా.. విన‌డానికే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా..!

Shimbu : తమిళ్ స్టార్ హీరో శింబు మన్మధ, వల్లభ సినిమాలతో తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాడు శింబు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాడు ఈ హీరో. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా వస్తోన్న సినిమా ‘లూప్‌’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ… ఈ సినిమాకి ముందు నా కెరీర్‌ చాలా డౌన్ లో ఉంది. అందుకే ఈ సినిమా కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను.

Tamil Hero Shimbu 27 kg weight loss
Tamil Hero Shimbu 27 kg weight loss

ముఖ్యంగా నన్ను నేను మార్చుకోవాలని 27 కిలోలు తగ్గాను అని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. శింబు హీరోగా, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో `మానాడు` అనే సినిమా రూపొందింది. ఇది ఈ నెల(నవంబర్‌) 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు.

సినిమాలో ఎస్‌జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని, అంతేకాదు సినిమా విడుదల తర్వాత అది మరో స్థాయికి వెళ్తుందని చెప్పాడు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన శింబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొందరు తనని టార్గెట్‌ చేశారని, కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు. శింబు ఏడవడం చూసి పక్కనే ఉన్న మిగతా సినిమా టీమ్‌ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఫిల్మ్ మేకర్‌ టీ రాజేందర్‌ తనయుడిగా బాలనటుడిగా తమిళ తెరకి పరిచయం అయ్యాడు శింబు. బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. `కాదల్‌ అజివతిల్లై` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. `ఇడియట్‌` రీమేక్‌ `దమ్‌` సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2004లో వచ్చిన `మన్మథన్‌` సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో శింబు ద్విపాత్రాభినయం చేశారు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన మధ్య ప్రేమలో పడటం, కెరీర్‌ ట్రాక్‌ తప్పడం, ప్రేమలో విఫలం చెందడం వంటి కారణాలతో కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు మరోసారి హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు శింబు.
అందులో భాగంగా ఇప్పుడు `మానాడు`, `మహ`, `పతు థలు`, `వెండు తనింధదు కాదు`, `కరోనా కుమార్‌` సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు శింబు.