KV ANAND: ఇండ‌స్ట్రీకు మ‌రో షాక్.. స్టార్ డైరెక్ట‌ర్ గుండెపోటుతో మృతి

గ‌త ఏడాది సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఎంద‌రో ప్ర‌ముఖులు త‌నువు చాలించారు. ఈ ఏడాదైన అలాంటి చెడు వార్త‌లు విన‌కుండా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్రార్ధించారు. కాని ప్ర‌ముఖులు అనారోగ్యంతోనో లేదంటే క‌రోనాతో క‌న్న‌మూస్తున్నారు. రీసెంట్‌గా పొట్టి వీర‌య్య మృతి చెంద‌గా, ఈ రోజు ఉద‌యం ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్ చెన్నైలోని త‌న ఇంట్లో గుండెపోటుతో క‌న్నుమూసారు. ప్ర‌స్తుతం ఆనంద్ వ‌య‌స్సు 54 కాగా, ఆయ‌న జీవా నటించిన రంగం.. సూర్య నటించిన బ్రదర్స్ చిత్రాలతో అతడి ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం.

ఫోటో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన కేవీ ఆనంద్ .. గోపురా వాసలీలే- మీరా- దేవర్ మగన్- అమరన్ – తిరుడా తిరుడా వంటి చిత్రాలకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కు సహాయకుడిగా పని చేశారు. ఆయ‌న‌కు జాతీయ ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ అవార్డ్ కూడా ద‌క్కింది. మిన్నారామ్- చంద్రలేఖ- ముదల్వన్ – జోష్- నాయక్- బాయ్స్- ఖాకీ -శివాజీ వంటి చిత్రాలకు పని చేశారు. ఒక దశాబ్దం పాటు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన త‌ర్వాత 2005 లో కన కందెన్ చిత్రంతో దర్శకుడిగా మారారు. అతను అయాన్- కో- మాట్రాన్- అనెగాన్- కవన్ – కప్పాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆనంద్ మృతితో ఇండ‌స్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. మంచి ద‌ర్శ‌కుడు లేక‌పోవ‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. నటుడు గౌతమ్ కార్తీక్ ట్విట్టర్ లో సంతాపం తెలియజేస్తూ.. అద్భుతమైన సృష్టికర్తను కోల్పోయాము. #KV ఆనంద్ సార్ మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. కుటుంబానికి నా సంతాపం అని అన్నారు. డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌ ఇక లేర‌నే విషాద‌ వార్తతో నిద్ర లేచాను. అద్భుతమైన కెమెరామన్‌, గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం. ఆయనను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాం.. ఆయన కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి’ అని టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు. సినిమాటోగ్రాఫర్-దర్శకుడు సంతోష్ శివన్ ట్విట్టర్ లో “కెవి ఆనంద్ ఆర్.ఐ.పి దేవుడు ఆశీర్వదిస్తాడు“ అని పోస్ట్ చేశారు.సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..ఈ వినాశకరమైన వార్త వినడం దురదృష్టకరం. అని దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement