Tollywood: టాలీవుడ్ ఇండ‌స్ట్రీపై ఆస‌క్తి చూపుతున్న త‌మిళ హీరోలు.. స్ట్రైట్ తెలుగు మూవీస్ చేసేందుకు ప్లాన్

Tollywood: యువ ద‌ర్శ‌క నిర్మాత‌లు వైవిధ్యమైన క‌థ‌లు తీసుకొస్తుండ‌డంతో భారీ హిట్స్ వ‌స్తున్నాయి. దీంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయి క్ర‌మ‌క్ర‌మేపి పెరుగుతూ పోతుంది. ఈ క్ర‌మంలో ప‌క్క భాష‌ల‌కు చెందిన స్టార్స్ కూడా మ‌న ఇండ‌స్ట్రీపై ఆస‌క్తి చూపుతున్నారు. ఒక‌ప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ వైపు క‌న్నెత్తి కూడా చూసేది కాదు, అలాంటిది ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన సినిమాల‌ను వారు రీమేక్ చేసుకుంటూ మంచి విజ‌యం సాధిస్తున్నారు. ఇక త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్ న‌టులు తెలుగులో స్ట్రైట్ సినిమా చేసేందుకు మ‌క్కువ చూపుతున్నారు.

Tollywood

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పటివరకు విజయ్ తన సినిమాలన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేసేవారు. ఇందులో కొన్ని సినిమాలు సూప‌ర్ హిట్ సాధించాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విజయ్ తెలుగులో నేరుగా ఒక్కసినిమా కూడా చేయలేదు. ఇప్పుడు ఆ వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి .. విజయ్ ను కలిసి స్క్రిప్ట్ వినిపించారని.. కథ నచ్చిన విజయ్ సానుకూలంగా స్పంధించినట్లుగా సమాచారం.త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌. ఇక త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కూడా తెలుగులో స్ట్రైట్ సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. మైత్రీ వారు తాజాగా విజయ్ సేతుపతి దగ్గరకు ఓ కథ తీసుకువెళ్లారట. మీడియం బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి మైత్రీ వారు ఫిక్స్ అయ్యారట. దీని కోసం సేతుపతికి పారితోషకం తోపాటుగా సినిమాలో వాటా కూడా ఉండనుందని టాక్ న‌డుస్తుంది.

Tollywood

ఇక ఇప్పుడు ర‌జ‌నీకాంత్ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో స్ట్రైట్ మూవీ చేసేందుకు స‌న్న‌ద్ద‌మైన‌ట్టు తెలుస్తుంది. బ‌డా నిర్మాణ సంస్థ‌లో స్టార్ డైరెక్ట‌ర్‌తో క‌లిసి ధ‌నుష్ మూడు భాష‌ల‌లో ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో సీనియ‌ర్ స్టార్ హీరో కూడా నటిస్తార‌ని స‌మాచారం . త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తుంది. రీసెంట్‌గా ధ‌నుష్ క‌ర్ణ‌న్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తర్వాత సినిమా స్థాయి మరింత పెరిగింది. అణగారిన కులాలను పల్లెటూర్లలో ఎంత దారుణంగా చూస్తారు.. అంటరాని వాళ్ళు అంటూ వాళ్ళని ఎంత దారుణంగా హింసిస్తారు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు మారి.