టాక్ షో కోసం బారి రెమ్యూనరేషన్ అందుకోబోతున్నతమన్నా

Advertisement

ఒక టాక్ షో లో హోస్ట్ గా చేయడానికి బారి రెమ్యూనరేషన్ అందుకోబోతుంది అంట అందాల భామ తమన్నా… అసలేంటి ఆ షో.. మరిన్ని విషయాలు ఆ షో గురించి తెలుసుకొనే వివరాల్లోకి వెళితే … అల్లు అరవింద్ ఈ మధ్య కాలం ఒకానొక ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ అయినటువంటి ఆహా ఆప్ ని విడుదల చేయగా అతి త్వరలోనే మంచి ఆదరణ మరియు పేరు ని సంపాదించి అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ఫ్లిక్స్ లకు ధీటుగా దూసుకుపోతుంది.

ఈ క్రమం లోనే ఈ షో కి మరింత హైప్ తేవడానికి అల్లు అరవింద్ ఒక టాక్ షో ని ప్రారంభించాలని చూస్తున్నాడు అంట…. ఇప్పటి వరకు ఉన్న తెలుగు టాక్ షో లలో ఎక్కువ మేల్ హోస్ట్ ఉండడం వలన సరి కొత్తగా ఒక ఫిమేల్ స్టార్ హోస్ట్ ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు అల్లు అరవింద్. ఆ సమయం లోనే హీరోయిన్ లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నా ని ఈ షో కోసం ఎంచుకున్నాడు. అయితే ఈ షో కోసం ఏకంగా 3 కోట్ల బారి రెమ్యూనరేషన్ తమన్నా కి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అంట.

మరి అంతలా అవలీలగా ఒప్పుకున్నాడు అంటే ఆ షో ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో అన్న ఊహ గానాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.. ఈ షో ఫార్మాట్ ఎలా ఉంటుందన్న విషయాలు ఇంతవరకు బయట తెలియనివ్వనప్పటికీ వీలైనంత త్వరగా ఈ షో ని మొదలు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నాడు అంట అల్లు అరవింద్.. అయితే ఈ షో మొదటి ఎపిసోడ్ లోనే మంచి హైప్ ఇవ్వడానికి మొదటి గెస్ట్ లు గా ఈ షో కి అల్లు అర్జున్, మరియు రామ్ చరణ్ లను తీసుకు రావాలని అనుకోవడం కూడా జరిగింది అంట.

కాగా ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్ లు కూడా రెండు వేరు వేరు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. మరి ఈ స్టార్ హీరో లు కలిసి ఒక కొత్త షో ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటె ఈ షో మొదలయ్యేంత వరకు వేచి చూడాలి. ఏమైనా కానీ బిజినెస్ వైస్ గా మంచి నిర్ణయం తీసుకోవాలంటే ముందంజలో సినీ పరిశ్రమలో అల్లు అరవింగ్ మరియు అక్కినేని నాగార్జున లే ఉంటారు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here