Tamannah: కేక పెట్టిస్తున్న త‌మ‌న్నా అందాలు.. నెటిజ‌న్స్ మైండ్ బ్లాక్

Tamannah: అందం, అభిన‌యం రెండు ఉన్న త‌మ‌న్నా దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంది. సినిమాలు, టీవీ షోస్, వెబ్‌సిరీస్ ఇలా ఏ ఛాన్స్ వ‌స్తే ఆ ఛాన్స్‌కి మ‌రో ఆప్ష‌న్ లేకుండా సై అంటుంది.ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సౌత్ లో సూపర్ సక్సెస్ అయిన తమన్నా ఒక వైపు స్మాల్ స్క్రీన్ లో ఫుల్ బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా హడావిడి చేస్తోంది.

Tamannah Latest Sizzling Stills
Tamannah Latest Sizzling Stills

కొద్ది రోజుల గ్యాప్‌లోనే త‌మ‌న్నా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో అల‌రించింది. సీటీమార్, మ్యాస్ట్రో చిత్రాల‌తో అల‌రించిన త‌మ‌న్నా రెండు చిత్రాల‌తో అద‌ర‌గొట్టింది. ఈ రెండు సినిమాల స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న త‌మ‌న్నాప‌లు క‌థ‌లు వింటుంది. కంప్లీట్ క్యారక్టర్సే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది తమన్నా.

Tamannah Latest Sizzling Stills
Tamannah Latest Sizzling Stills

కెరీర్ లో సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 సీక్వెల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది తమన్నా. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చి సూపర్ హిట్ అయిన ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తోంది ఎఫ్ 3. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.

Tamannah Latest Sizzling Stills
Tamannah Latest Sizzling Stills

స‌త్యదేవ్ తో గుర్తుందా సీతాకాలం, లేడీ ఓరియెంటెడ్ మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మితో పాటు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తోంది. ఇలా చేతి నిండా సినిమాలతో తెగ హడావిడి చేస్తోంది తమన్నా. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న త‌మన్నా గ్లామ‌ర‌స్ ఫొటో షూట్స్‌తో కైపెక్కిస్తుంది. త‌మ‌న్నాని ఇలా చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.