Tamannah Bhatia : ఓహో గులాబీ బాలా.! మిల్కీ బ్యూటీ నయా అవతార్.! చూస్తే షాకవ్వాల్సిందే.!

NQ Staff - September 28, 2022 / 09:25 PM IST

Tamannah Bhatia  : ఓహో గులాబీ బాలా.! మిల్కీ బ్యూటీ నయా అవతార్.! చూస్తే షాకవ్వాల్సిందే.!

Tamannah Bhatia  : మిల్కీ బ్యూటీ తమన్నా ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయింది. బ్లాక్ అండ్ పింక్ కలర్ ప్యాటర్న్‌లో మిల్కీ బ్యూటీ నయ డిజైన్ వేర్ యూత్‌ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. గులాబీ డిజైన్‌తో చేసిన ఈ సరికొత్త కాస్ట్యూమ్, తమన్నా అందాన్ని వెయ్యి రెట్లు పెంచేసిందంటే అతిశయోక్తి కాదేమో.

ఇటీవలే తమన్నా ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించింది. బబ్లీ బౌన్సర్‌గా తమన్నా నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలో రిలీజ్ కావడం వల్లనో ఏమో, ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది ఈ సినిమా.

ఫ్యాషన్ ఐకానే కాదు, బౌన్సర్ కూడా..

అంతేకాదు, ఓ మంచి సినిమా చూశామన్న ఫీల్ కలిగింది సగటు ప్రేక్షకుడికి. అన్ని రకాల ఎమోషన్స్‌ కలగలిసిన ఓ పల్లెటూరి బౌన్సర్ అమ్మాయి పాత్రలో తమన్నా తన అనుభవాన్ని రంగరించి నటించింది.

ఇక ప్రస్తుతం తమన్నా చేతిలో రెండు సినిమాలున్నాయ్. రెండూ క్రేజీ ప్రాజెక్టులే కావడం విశేషం. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నా, చిరంజీవికి జోడీగా నటిస్తోంది. అలాగే, తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’లోనూ తమన్నానే హీరోయిన్.

అన్నట్లు బబ్లీ బౌన్సర్ సూపర్ హిట్ కావడంతో, దానికి సీక్వెల్ తీసే ఆలోచనలోనూ మిల్కీ బ్యూటీ అండ్ బబ్లీ బౌన్సర్ టీమ్ వున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us