Tamannaah: గ‌ని స్పెష‌ల్ సాంగ్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌.. వ‌రుణ్ తేజ్‌తో ర‌చ్చ చేయ‌నున్న మిల్కీ బ్యూటీ

Tamannaah: దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్నారు మ‌న హీరోయిన్స్. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఒక‌వైపు హీరోయిన్‌గా చేస్తూనే స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు, టీవీ షోస్, యాడ్స్ ఇలా ఒక‌టేంటి త‌న‌కు వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్‌లో రచ్చ చేస్తుంది. ఇప్పుడు గని సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. కొద్ది సేప‌టి క్రితం త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

Tamannaah special song in ghani
Tamannaah special song in ghani

త‌మ‌న్నా హాట్ లుక్ విడుద‌ల చేసిన టీం జ‌న‌వ‌రి 15 ఉద‌యం 11.08ని.ల‌కు సాంగ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఇంత‌క‌ముందు త‌మ‌న్నా.. అల్లుడు శీను, జై లవ కుశ,స్పీడున్నోడు, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు ససినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసింది. తమన్నా మంచి నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. ఆమె చేసిన ఐటమ్ సాంగ్సే దానికి. బెస్ట్ ఎక్జాంపుల్.

ఇప్పుడు గ‌ని సినిమా కోసం త‌మ‌న్నా ఎంత‌లా ర‌చ్చ చేస్తుందో చూడాలి. ఇక గ‌ని సినిమాలో న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Tamannaah special song in ghani2
Tamannaah special song in ghani2

గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మ‌రి కరోనా మ‌ళ్లీ కోర‌లు చాచ‌డంతో ఈ సినిమా వాయిదా ప‌డుతుందా, చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా అన్న‌ది చూడాలి.