Tamannaah: గని కోసం త‌మ‌న్నా అదిరిపోయే స్టెప్పులు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Tamannaah: మెగా హీరో వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం గ‌ని. చివ‌రిగా గద్దల కొండ గణేష్ మూవీతో మంచి సక్సెస్ పొందాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమా తర్వాత… గని మూవీలో నటిస్తున్నాడు తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద, అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tamannaah special look in ghani (1)
Tamannaah special look in ghani (1)

కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేకను ఇమేజ్ ను తెచ్చుకుంటున్నాడు. తొలి చిత్రాల కథల విషయంలో తడబడ్డా.. తర్వాత మూస కథలకు స్వస్తి పలికాడు. కొత్తదనానికి అర్థమిచ్చేలా వరుణ్ విభిన్న కథలను ఎంచుకోవడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా గని చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

గ‌ని సినిమాలో బాక్సర్ పాత్రలో వరుణ్ అభిమానులు, సినీ ప్రియులను మెప్పించనున్నారు. గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ‘గని’ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే గని అంథిమ్ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి వ్యూవర్ షిప్ ను అందుకుంది. కాగా ఈ సినిమాలో రెండోవ స్పెషల్ సాంగ్ కు మిల్క్ బ్యూటీ తమన్నాను ఎంచుకోగా, కొద్ది సేప‌టి క్రితం సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌లో త‌మ‌న్నా అద‌ర‌గొట్టింది. ఇందులో త‌మ‌న్నా మాస్ బీట్స్‌కి త‌గ్గ‌ట్టుగా స్టెప్పులు వేసిన‌ట్టు అర్ధ‌మవుతుంది. ఈ సినిమాలో తమన్నా ‘కొడితే’ టైటిల్ ఉన్న ఐటెం సాంగ్ లో కనిపించనుంది.

తమన్నా గతంలో సరిలేరు నీకెవ్వరు మూవీలో ఐటెం సాంగ్ లో ఆడిపాడి మహేష్ బాబు ఫ్యాన్స్ ను మెప్పించింది.
వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ గని చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్‘గని’ సినిమాతో పాటు ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు