Tamannaah: త‌మ‌న్నా బ్యూటీ సీక్రెట్ ఉమ్మి (సలైవా) అనే విష‌యం మీకు తెలుసా?

Tamannaah:దశాబ్ధం పైగానే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓవెలుగు వెలిగిన అందాల భామ తమ‌న్నా. చూడ‌చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. న‌టిగా త‌న స్థాయిని మ‌రింత పెంచుకునేందుకు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తుంది. మ‌రోవైపు హోస్ట్‌గా కూడా మార‌బోతుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలలో ఉన్న బిజీ హీరోయిన్ త‌మ‌న్నా కాగా, ఆమె న‌టించిన సీటీమార్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tamannaah

త‌మ‌న్నా ప్ర‌స్తుతం గుర్తుందా సీతాకాలం, ఎఫ్ 3 అనే తెలుగు చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాలు,హిందీ చిత్రాలు కూడా చేస్తుంది. ముఖ్యంగా త‌న అందంతో ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్న త‌మ‌న్నా మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. త‌మ‌న్నా గ్లామ‌ర్ చూసి అమ్మాయిల‌కి కూడా అసూయ పుడుతుందంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఒక‌సారి త‌న‌కు మిల్కీ బ్యూటీ అని పిలిపించుకోవ‌డం ఇష్టం లేద‌ని, శ‌రీర సౌంద‌ర్యంతో ఓ మ‌నిషిని అంచ‌నా వేయ‌డం త‌ప్పని చెప్పుకొచ్చింది.

అయితే త‌మ‌న్నా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాల‌ని చాలా మందికి ఉంటుంది. తాజాగా మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్.. ఏంటి అని అడిగిన ప్రశ్నకు అమ్మడు క్రేజీ ఆన్సర్ చెప్పింది. ఆహె ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను అప్లై చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. స‌లైవా స్కిన్ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని తెలిపింది.

Tamannaah

త‌మ‌న్నా ఆన్స‌ర్స్‌తో అంతా షాక‌య్యారు.రీసెంట్‌గా త‌మ‌న్నా ..నితిన్‌తో క‌లిసి మ్యాస్ట్రో అనే షూటింగ్‌లో పాల్గొంది. మ్యాస్ట్రో చిత్రంలో తమ్మూ కాస్త డిఫ‌రెంట్ షేడ్ పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక యష్ సరసన మరో పాన్ ఇండియా మూవీలో నటించనుందని ప్రచార జ‌రుగుతుంది.

రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ 2 తర్వాత కన్నడ దర్శకుడు నార్తన్ తెరకెక్కించే భారీ యాక్షన్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఇది ఆర్మీ నేపథ్యంలో సాగే సినిమా. ఇందులో తమన్నా కథానాయికగా నటించనుంది. యష్ నటించిన కేజీఎఫ్ లో అదిరిపోయే స్పెషల్ నంబర్ తో దుమ్మురేపిన తమన్నాకు ఇప్పుడు యష్ స‌ర‌స‌న క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంద‌నే ప్ర‌చారం అయితే న‌డుస్తుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.