tamannaah : త‌మ‌న్నా, ఏంటి ఇలా మారిపోయావ్..!

tamannaah : ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతుంది త‌మ‌న్నా. ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్‏కు స్ట్రాంగ్ పోటీ ఇస్తూ వరుస ఆఫర్లను కొల్లగొడుతుంది. బుల్లితెర.. వెండితెరపై సత్తా చాటుతూనే .. అటు డిజిటల్ రంగంలోనూ రాణిస్తోంది.

tamannaah lunch time1
tamannaah lunch time1

ఇటీవల నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమాతో సరికొత్త ప్రయత్నం చేసింది. మొదటి సారి విలన్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది. మ్యాస్ట్రో సినిమాలో మిల్కీబ్యూటీ నటనకు అంతా ఫిదా అయ్యారు.. ప్రస్తుతం ఈ అమ్మడు ఎఫ్ 3 సినిమా చేస్తుంది. ఇందులో వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. తమిళ మూవీ వేదాళంకు తెలుగు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. త‌మ‌న్నా క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. భోళా శంకర్ సినిమా కోసం మిల్కీబ్యూటీ దాదాపు 3 కోట్లు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టాటస్ సంపాదించిన త‌మ‌న్నా తన గ్లామ‌ర్‌తోను తెగ ర‌చ్చ చేస్తుంటుంది. ఇప్ప‌టికే ఈ అమ్మ‌డు హాట్ హాట్ ఫొటోల‌తో హీటెక్కించింది. తాజాగా త‌మ‌న్నా వెరైటీ గెట‌ప్‌లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచింది. త‌ల‌కు కిరీటం ఎదురుగా అర‌టి ఆకులో వెరైటీ ఫుడ్‌.. త‌మ‌న్నా లుక్స్ స్ట‌న్నింగ్‌గా ఉన్నాయి.

tamannaah lunch time
tamannaah lunch time

ఈమధ్య తమన్నా నటించిన సీటీమార్, మాస్ట్రో చిత్రాలు కూడా జనాదరణ పొందలేదు. ఐతే.. ఎఫ్ 3తో మళ్లీ తన కెరీర్ పుంజుకుంటుందని ఆశపడుతోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తందా శీతాకాలం తో పాటు ఓ హిందీ చిత్రం కూడా ఉంది.