Tamannaah Bhatia Reacted Lip Lock Scenes Comments : లిప్ లాక్ సీన్లు చేయకుంటే నన్ను ఆంటీని చేసేస్తారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!
NQ Staff - August 6, 2023 / 09:02 AM IST
Tamannaah Bhatia Reacted Lip Lock Scenes Comments :
తమన్నా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇప్పటికీ వరుసగా హీరోయిన్ ఛాన్సులు వస్తూనే ఉన్నాయి ఆమెకు. కెరీర్ లో పెద్దగా హిట్ ట్రాక్ లేకపోయినా ఆమెకు మాత్రం ఆఫర్లు అస్సలు తగ్గట్లేదు. ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారు. కానీ తమన్నాకు మాత్రం ఇంకా హీరోయిన్ ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికీ చెక్కు చెదరని గ్లామర్ తో పిచ్చెక్కిస్తూనే ఉంది. ఇక ఆమె నటించిన జైలర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు ఆమె మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ఓ ప్రెస్ టీమ్ లో ఆమెకు కొన్ని వల్గర్ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నడుమ ఆమె జీ కర్దా, లస్ట్ స్టోరీస్ లలో ఓ రేంజ్ లో లిప్ లాక్, బెడ్ సీన్లు చేసి రెచ్చిపోయింది.
ఎందుకు చేశానంటే..?
ఆమె ఇలాంటి సీన్లు చేయడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఆమె ఇలా ఎందుకు చేసింది అని అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ.. ఇలాంటి సీన్లు కేవలం యూత్ ను ఎంటర్ టైన్ చేయడం కోసమే చేశాను అంటూ తెలిపింది తమన్నా. అలాంటివి చేయకపోతే నన్ను హీరో చెల్లెలి గానో లేదంటే సినిమాలో ఆంటీని చేసేస్తారు.
అందుకే ఇలాంటి సీన్లు చేయాల్సి వచ్చింది. ఒక నటిగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పులేదని భావిస్తున్నా అంటూ తెలిపింది తమన్నా. తమన్నా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటు తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో కూడా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.