TAMANNAH: త‌న ఇంటిని ప‌రిచయం చేసిన త‌మ‌న్నా.. ఇల్లు ఎంత అందంగా ఉందో చూశారా..!

మిల్కీ బ్యూటీ త‌మన్నా ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా మారింది. కేవ‌లం తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మంచి స‌క్సెస్‌లు సాధిస్తుంది. 16 ఏళ్ల నుండి ఇండ‌స్ట్రీలో ఉన్న త‌మ‌న్నా భారీగానే డ‌బ్బులు సంపాదించిపెట్టుకుంది. ప్ర‌స్తుతానికైతే పెద్ద‌గా బిజినెస్‌ల‌పై దృష్టి పెట్ట‌ని ఈ అమ్మ‌డు సినిమాలు ,ప్ర‌క‌ట‌న‌ల‌తో బిజీగా ఉంది. రీసెంట్‌గా మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ యాడ్‌లో నటించ‌గా, దీనిని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. మరి కొద్ది రోజుల‌లో ఈ యాడ్ ఎయిర్ కానుంది.

ఇక త‌మ‌న్నా తాజాగా ఓ ప్రముఖ పెయింటింగ్ కంపెనీ నిర్వహించిన ప్ర‌చార‌ కార్యక్రమంలో భాగంగా త‌న ఇంటిని చూపించింది. 15 కోట్ల రూపాయాల‌తో ముంబైలో త‌‌న ఇంటిని ఇంద్ర‌భ‌వ‌నం మాద‌రిగా క‌ట్టుకుంది. షూటింగ్ వ‌ల‌న ఇంటి ప‌నులు నేను పెద్ద‌గా ప‌ట్టించేకోలేక‌పోయిన‌ప్ప‌టికీ మా నాన్న అన్ని ద‌గ్గ‌రుండి చూసుకున్నారని, ఇంటి నిర్మాణం కూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల‌లోనే జ‌రిగింద‌ని తెలియ‌జేసింది. అత్యంత భారీ విస్తీర్ణంలో విలాసవంతంగా ఈ ఇంటిని నిర్మించుకున‌ట్టు త‌మ‌న్నా పేర్కొన‌గా, షూటింగ్స్ వ‌ల‌న తన‌కు ఈ ఇంట్లో ఉండే అవ‌కాశం ఎక్కువ‌గా రాద‌ని త‌మ్మూ స్ప‌ష్టం చేసింది. సొంతింట్లో ఉంటే ఆ అనుభూతి వేరు. నా తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడుతూ.. టీ తాగడాన్ని ఆస్వాదిస్తానంటుంది మిల్కీ బ్యూటీ.

ఇంటితో పాటు త‌న పెట్ డాగ్‌, ఎక్వెరియంలో ఫిషెస్ , త‌న మేక‌ప్ రూం, బెడ్ రూం అన్నింటిని ప‌రిచ‌యం చేసింది. ఎక్క‌డికెళ్లిన కూడా ఇంటికి వస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. నా ఇల్లు నాకు ప్ర‌తి రోజు కొత్త‌గానే ఉంటుంది. ఇంట్లో ఉంటే చాలా ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంటుంద‌ని త‌మ‌న్నా పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మ‌డు ఎఫ్ 2 సీక్వెల్‌గా అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3 చిత్రంతో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలతో బిజీగా ఉంది. మ‌రోవైపు గోపిచంద్ స‌ర‌స‌న సీటీమార్ అనే చిత్రంలో న‌టించింది. ఇందులో క‌బ‌డ్డీ కోచ్‌గా క‌నిపించి అల‌రించ‌నుంది.

Advertisement