Tamannaah Bhatia : 15 ఏళ్ల కెరీర్ లో తొలిసారి లిప్ లాక్ చేసిన తమన్నా.. ఆ నటుడితోనే..!
NQ Staff - March 17, 2023 / 04:40 PM IST

Tamannaah Bhatia : తమన్నా మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉంది. కానీ ఇప్పుడు సౌత్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేండ్లు దాటిపోతున్నాయి. వాస్తవానికి ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా ఇప్పటికే పెండ్లిలు చేసుకున్నారు. కానీ తమన్నా మాత్రం ఇంకా వరుసగా ఛాన్సులు అందుకుంటోంది.
ఇక హిందీలో సంచలనం సృష్టించిన లస్ట్ స్టోరీస్ అనే సిరీస్ లో గతంలో కియారా అద్వానీ నటించింది. మొదటి సిరీస్ ఎంత క్రేజ్ సంపాదించుకునిందో మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు లస్ట్ స్టోరీస్ సీజన్-2 తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటించ బోతోంది. ఆమెతో పాటు తమన్నా ప్రియుడిగా రూమర్స్ వస్తున్న విజయ్ వర్మ కూడా నటిస్తున్నాడు.
రూల్స్ బ్రేక్ చేసి..
నీనా గుప్తా, కాజోల్ లాంటి సీనియర్ నటీమణులు సైతం ఇందులో కనిపించనున్నారు. అయితే తమన్నా 15 ఏండ్ల కెరీర్ లో ఇప్పటి వరకు హద్దులు దాటి లిప్ లాక్, బెడ్ సీన్లు చేయలేదు. కానీ మొదటిసారి ఈ లస్ట్ స్టోరీస్ సీజన్-2లో లిప్ లాక్, బెడ్ సీన్ లో నటించిందంట. ఇదే విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
అది కూడా తన ప్రియుడు అయిన విజయ్ వర్మతోనే అంట. ఈ విషయం తెలుసుకున్న తమన్నా ఫ్యాన్స్.. ఆమె తన ప్రియుడి కోసం తాను పెట్టుకున్న రూల్స్ ను కూడా బ్రేక్ చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా ప్రేమ ఏదైనా చేయిస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు.