Tamannaah Bhatia : హీరోయిన్లతో రొమాన్స్ అంటే ఆ హీరోలు వణికిపోతారు.. తమన్నా సంచలన కామెంట్లు..!
NQ Staff - January 20, 2023 / 10:25 AM IST

Tamannaah Bhatia : ఈ నడుమ హీరోయిన్లు బాగా ముదిరిపోతున్నారు. తమ స్థాయిని పక్కన పెట్టి మరీ కొన్ని సార్లు వల్గర్ కామెంట్లు చేస్తున్నారు. ఎవరేం అనుకుంటారో అనే విషయాలను కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఇప్పడు తాజాగా తమన్నా చేసిన కామెంట్లు కూడా అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఆమె ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేయడం చాలా అరుదుగానే ఉంటుంది.
ఆమె చాలా తక్కువ టైమ్ లోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఒకప్పుడు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఆమె ఇప్పుడు మాత్రం ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తోంది. ఇక సీనియర్ హీరోలకు ఇప్పుడు ఆమె బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ మీదనే ఆమె ఫోకస్ పెట్టింది.
రొమాంటిక్ సీన్లలో..
ఈ నడుమ ఆమె ఐటెం సాంగ్స్ చేయడం కూడా బాగానే తగ్గించేసింది. కేవలం తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె హీరోలపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రొమాంటిక్ సీన్లలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువగా వణికిపోతారని తెలిపింది.
తాను చాలామంది హీరోలతో రొమాంటిక్ సీన్లలో నటించానని.. అప్పుడు ఆ హీరోలు కాస్త టెన్షన్ పడటం తాను గమనించినట్టు తెలిపింది. నిజంగా ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నట్టు వారు ఫీల్ అయ్యారు కాబట్టే అలా టెన్షన్ పడ్డారేమో అంటూ తమన్నా కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.