Tamannaah Bhatia : విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఇస్తారా.. తమన్నాలో ఇంత కోరిక ఉందా…?

NQ Staff - June 15, 2023 / 11:27 AM IST

Tamannaah Bhatia : విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఇస్తారా.. తమన్నాలో ఇంత కోరిక ఉందా…?

Tamannaah Bhatia : తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఊగిపోయే వారు ఉంటారు. ఆమెకు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. చేసిన సినిమాల్లో హిట్లు తక్కువే అయినా.. ఆమె అందాలకు ఉన్న ఫాలోయింగ్ తోనే ఆమెకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు తమన్నా ఎలాంటి బోల్డ్ సీన్లు చేయలేదు.

లిప్ లాక్ లు కూడా ఇవ్వలేదు. అలాంటి తమన్నా ఇప్పుడు లస్ట్ స్టోరీస్-2 కోసం తన పద్ధతులు మార్చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె చాలా బోల్డ్ గా నటించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టీజర్స్ లో ఓ రేంజ్ లో తమన్నా రొమాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే బూతులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి.

అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ బైట్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె మాట్లాడుతూ ఈ సిరీస్ లో నా కోస్టార్ ఎవరు అని తమన్నా అడుగుతుంది. దాంతో విజయ్ అని సమాధానం ఇస్తారు. ఆమె ఆతృతగా.. విజయ్ దేవరకొండనా అని అడుగుతుంది. కాదు విజయ్ వర్మ అని సమాధానం రాగానే నిరాశ పడుతూ నిట్టూరుస్తుంది.

Tamannaah Bhatia Acted Very Boldly In Lust Stories 2 Web Series

Tamannaah Bhatia Acted Very Boldly In Lust Stories 2 Web Series

అంటే విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలని ఆమె ఆశగా ఉందన్నమాట. ఇదే విషయాన్ని కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. రౌడీ విజయ్ తో రొమాన్స్ చేయాలని అంత ఆశగా ఉందా అంటూ అడుతున్నారు. కొందరేమో విజయ్ తో సినిమా చెయ్.. నీ కోరిక తీరుస్తాడు అని అంటున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us