Tamannaah: రెండు నెలలు కంటిన్యూగా అదే పని.. తమన్నా కామెంట్స్ వైరల్

Tamannaah మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో చేసే సందడి ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తమన్నాకు కరోనా సోకిన విషయం తెలిసింది. దాదాపు పది పదిహేను రోజుల క్వారంటైన్ తరువాత తమన్నాకు కరోనా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలా నెగెటివ్ వచ్చిన తరువాత తమన్నా తన అభిమానులతో ముచ్చటించింది. క్వారంటైన్‌లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. అలా కొందరు నెటిజన్లు మాత్రం తమన్నా శరీరాకృతి, గ్లామర్‌లో వచ్చిన మార్పుల గురించి అడిగారు. చబ్బీగా అయ్యావని, మొహంలో మార్పులు వచ్చాయని అడిగారు.

క్వారంటైన్‌లో ఏ పని చేయకుండానే ఉన్నాను.. పైగా మెడిసిన్స్ వేసుకున్నా. హాస్పిటల్ నుంచి వస్తే ఇంకెలా ఉంటారంటూ అలాంటి కామెంట్ల పై తమన్నా స్పందించింది. మీడియా కూడా ఇలాంటి ప్రశ్నలే అడగడంతో తమన్నా ఫైర్ అయింది. కరోనా వచ్చింది.. తగ్గింది అని అంటే.. అందరూ తన గ్లామర్ గురించి అడుగుతున్నారేంటని ప్రశ్నించింది. అయితే తాజాగా తమన్నా కొన్ని కామెంట్లు చేసింది. ఇందులో భాగంగా తన ఫిట్ నెస్‌ను మళ్లీ తిరిగి తెచ్చుకున్నానని చెప్పుకొచ్చింది.

అయితే కరోనా నుంచి కోలుకున్న తమన్నా ప్రతీ రోజూ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ప్రతీ రోజూ ఏదో ఒక మూవీ సెట్‌లో ఉంటోంది. ఆ మధ్య సీటీమార్ మూవీ సెట్‌లో సందడి చేసింది. అంతే కాకుండా అది ముగిసిన వెంటనే మళ్లీ గుర్తందా శీతాకాలం సెట్‌లో సందడి చేసింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్‌గానే పూర్తయింది. ఇదే విషయాన్ని తమన్నా చెబుతూ.. దర్శకుడు హీరో నన్నెంతో బుజ్జగిస్తూ బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చింది.

అయితే షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా వర్కవుట్లను మాత్రం వదల్లేదని చెప్పింది. కంటిన్యూగా రెండు నెలలు వర్కవుట్లు చేస్తూనే ఉన్నాను.. అందుకు మునుపటిలా మళ్లీ నా శరీరం మారిపోయింది.. మరింత ఫిట్‌గా అయ్యానని తమన్నా చెప్పుకొచ్చింది. మరీ అతిగా ప్రవర్తించాల్సిన పని లేదు.. నిలకడగా ఉంటే చాలు.. రెండు నెలలు నిలకడగా ఉంటూ.. మా కోచ్‌లు చెప్పినట్టుగా వర్కవుట్‌లు చేశాను. అంతే కోవిడ్ కంటే ముందుగా నా బాడీ ఎలా ఉందో అలా తయారైందంటూ తన ఫిట్ నెస్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

Advertisement