Afghanistan: రోజురోజుకి పెరిగిపోతున్న తాలిబ‌న్ల అరాచ‌కాలు.. గోళ్ల రంగు వేసుకుంటే ఫింగ‌ర్స్ క‌ట్

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నాక అక్కడ అడుగడుగునా అరాచకం క‌నిపిస్తుంది. తాలిబన్ల రాజ్య స్థాపన ముఖ్యంగా మహిళల మనుగడకే పెద్ద ముప్పులా పరిణమించింది. షరియా చట్టాలకు లోబడి వారి హక్కులను గౌరవిస్తామని.. కాపాడుతామని చెప్పిన తాలిబన్లు… ఎక్కడా ఆ మాటను నిలుపుకోవడం లేదు. మహిళల పట్ల వారి అరాచకాలు రోజురోజుకి శృతిమించి పోతున్నాయి.


Talibans cut off Womens Fingers for using Nail Varnish
Talibans cut off Womens Fingers for using Nail Varnish


మహిళలను హింసించడం,సెక్స్ బానిసలుగా మార్చడమే కాదు.. ఆఖరికి వారి శవాలను కూడా సెక్స్ డాల్స్‌లా ఉపయోగిస్తున్నారు. గోళ్లకు రంగు (నెయిల్ పాలిష్) వేసుకుని కనుక మహిళ కనిపిస్తే వేళ్లు తెగ్గోస్తామని హెచ్చరిస్తున్నారు. కాబూల్ వీధుల్లో స్నేహితులతో కలిసి వెళ్తున్న తమను జిహాదీల గ్రూపు వెంబడించిందని, తమను చుట్టుముట్టి ఇస్లామును అగౌరవపరిచినట్టు ఆరోపించారని ఓ టీనేజీ గ్రూపు పేర్కొంది.

టీ షర్టులు, జీన్స్ ధరించిన తాలిబన్లు తమను టార్గెట్ చేశారని మరికొందరు ఆరోపించారు. ఆఫ్ఘన్ దుస్తులు ధరించలేదని తమ జర్నలిస్టును తాలిబన్లు చావగొట్టారని ఆఫ్ఘాన్ న్యూస్ పేపర్ ఎటిలాట్‌రాజ్ రెండు రోజుల క్రితం పేర్కొంది. పురుషులకు తాము డ్రెస్‌కోడ్ డిసైడ్ చేస్తామని తాలిబన్లు చెప్పినట్టు దినపత్రిక తెలిపింది.

మ‌హిళ‌ల‌తో సెక్స్ చేయోద్దని, ప‌శువుల‌తో లైంగికంగా వ్య‌వ‌హ‌రించొచ్చ‌ని ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఆడ‌వాళ్ల‌ని వ‌స్తువులుగా చూస్తున్న తాలిబ‌న్స్‌పై ప్ర‌తి ఒక్క‌రు మండిప‌డుతున్నారు.ఇటీవల‌ టఖర్ ప్రావిన్స్‌ రాజధాని టలోకన్‌లో బురఖా ధరించనందుకు ఓ మహిళను కాల్చి చంపారు

కాబూల్ ఎయిర్‌పోర్టులో కొనసాగుతున్న గందరగోళం నేపథ్యంలో కాల్పులు జరపడానికి ముందు మహిళలు, చిన్నారులపై తాలిబన్లు కొరడాలు ఝళిపించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం నలుగురు మహిళలు మరణించారు. వంట సరిగా చేయలేదని ఓ మహిళకు నిప్పు పెట్టి చంపేశారు. 12 ఏళ్లు నిండిన బాలికలను బలవంతంగా తాలిబన్లు వివాహం చేసుకుంటున్నారు. బిగుతు దుస్తులు ధరించినందుకు ఓ మహిళను కాల్చి చంపారు.

ప్రతీ ఇంటి నుంచి ఆడవాళ్లు తమతో రావాల్సిందేనని తాలిబన్లు అక్కడి కుటుంబాలను వేధిస్తున్నట్లు మస్కన్ తెలిపారు. మాట వినని వారిని చంపేసైనా వారితో తీసుకెళ్తున్నారని చెప్పారు. మనిషికి ప్రాణం ఉందా లేదా అన్నది వారికి ముఖ్యం కాదు… ఆ మనిషి ఆడదైతే చాలు… శవంతోనూ సెక్స్ చేస్తారని పేర్కొన్నారు. ఇలా శవాలతోనూ సెక్స్ చేయడాన్ని నెక్రోఫిలియా అని పిలుస్తారు. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్లకు ఇది అలవాటేనని చెబుతున్నారు.