Sohel: బిగ్ బాస్ జ‌ర్నీలో త‌నకున్న ఎనిమీ ఎవ‌రో చెప్పిన సోహైల్..!

Sohel: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఐదో సీజ‌న్‌కి రంగం సిద్ధం చేసుకుంటుంది. గ‌త సీజ‌న్ క‌రోనా స‌మ‌యంలో అనేక జాగ్ర‌త్త‌ల మ‌ధ్య స‌జావుగానే సాగింది. ఈ కార్యక్ర‌మంలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్స్ కొత్త వాళ్ల‌యిన కూడా వారికి ఈ షో ద్వారా ఫుల్ పాపులారిటీ ద‌క్కింది. ముఖ్యంగా సోహైల్ బిగ్ బాస్ షోతో ఓవ‌ర్‌నైట్ సెల‌బ్రిటీగా మారాడు.

Sohel

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు సోహైల్ అంద‌రితో క‌లిసి మెలిసి తిరిగాడు. బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా అంద‌రితో చాలా స్ట్రాంగ్ బాండింగ్ మెయింటైన్ చేస్తున్నాడు. కాని బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు త‌న‌కు ఓ అజాత‌శత్రువు ఉన్నాడ‌ని, వాడి అంతు ఇప్పుడు చూస్తాన‌ని అంటున్నారు సోహైల్. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అరియానా, సోహైల్‌లు టామ్ అండ్ జెర్రీలా ఉండేవారు. అప్పుడే కొట్లాడుకునేవారు, అప్పుడే క‌లిసిపోయేవారు.

కాని ఓ సారి మాత్రం అరియానా, సోహైల్‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయి ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దానికి కార‌ణం చింటు అనే టెడ్డీ బేర్. ఏదో విష‌యంలో కోపంతో టెడ్డీ బేర్‌ని సోహైల్ స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేయ‌డంతో అరియానాకి కోపం న‌షానికి ఎక్కింది. అత‌నిపై భీక‌రంగా విరుచుకు ప‌డింది. ఇద్ద‌రి మ‌ధ్య చాలా సేపు ఆర్గ్యుమెంట్ జ‌రిగిన త‌ర్వాత సోహైల్ బొమ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్లి నీ వ‌ల్ల మా ఇద్ద‌రికి గొడ‌వ అయింది. నీ మీద ఎప్పుడో అప్పుడు ప్రతీకారం తీర్చుకుంటా అని వార్నింగ్ ఇచ్చాడు.

Sohel

అయితే తాజాగా తనకు, అరియానాకు చిచ్చు పెట్టిన చింటు(అరియానా ఫేవరెట్‌ కోతి బొమ్మ)ను దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు సోహైల్. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన సోహైల్.. ‘బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్‌ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి’ అని చెప్పుకొచ్చాడు.

“మొట్టమొదటిసారి నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది. బిగ్‌బాస్‌ జర్నీలో నాకున్న ఒకే ఒక ఎనీమీ వీడే. ఎట్ట‌కేల‌కు దొరికేశాడు . ఇక వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. అసలు వీడంటూ లేకపోయుంటే బిగ్‌బాస్‌లో నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. వీడి మీద రివేంజ్‌ తీసుకునేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో ఇంకెవరి మీదా ప్రతీకారం తీర్చుకోనని మాటిస్తున్నా..” అని చెప్పుకొచ్చాడు సోహైల్.

అయితే త‌న ఫేవ‌రేట్ బొమ్మ‌ని సోహైల్ అమ్మేస్తాన‌ని చెప్ప‌డంతో అరియానా .. అరేయ్, నిన్ను చంపేస్తా, అది అమ్మ‌డానికి కాదు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ప్ర‌స్తుతం అరియానా, సోహైల్‌లు మంచి రిలేష‌న్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడ‌ప్పుడు క‌ల‌వ‌డం , పార్టీలు చేసుకోవ‌డం వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేయ‌డం వంటివి చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు.