Swethabasuprasad : శ్వేతాబ‌సుప్ర‌సాద్ ఏమి చెప్పావు మహాతల్లి .. విడాకుల గురించి సీక్రెట్ లీక్ చేసిన టాప్ హీరోయిన్ ..!

Swethabasuprasad : శ్వేతాబ‌సుప్ర‌సాద్ ..కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన సంగతి తెలిసిందే. డెబ్యూ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి. రెండు మూడు సినిమాల తర్వాత శ్వేతాబ‌సుప్ర‌సాద్ కి టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా పోయాయి. అదే సమయం లో శ్వేతాబ‌సుప్ర‌సాద్ ను పలు వివాదాలు చుట్టుకున్నాయి. దీంతో శ్వేతాబ‌సుప్ర‌సాద్ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంది. సినీ కెరీర్ లేక .. పర్సనల్ లైఫ్ ఇబ్బందుల్లో పడి కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.

swethabasuprasad-what-did-she-say-secret-regarding-top-heroine-divorce-is-revealed
swethabasuprasad-what-did-she-say-secret-regarding-top-heroine-divorce-is-revealed

ఆ తర్వాత ఏకంగా పెళ్ళి చేసుకుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారంగా వెల్లడిస్తూ 2018 డిసెంబర్ 13న పెళ్ళి చేసుకున్నట్టు వెల్లడించింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను శ్వేతా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అనూహ్యంగా పెళ్లైయినా సంవత్సరంలోపే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా.. ఈ విషయంపై స్పందించింది శ్వేత. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలిపింది. అంతేకాదు.. దానికి విడాకులు అని పేరు పెట్టాల్సిన పనిలేదని ఒక బ్రేకప్ లా జరిగిందని వింతగా మాట్లాడింది శ్వేతాబసు.

Swethabasuprasad : శ్వేతాబ‌సుప్ర‌సాద్ వివరణ కొందరికి మరీ వింతగా ఉందట..!

అయితే వాస్తవంగా రోహిత్‌కు దూరమైన సమయంలో చాలా బాధపడిన‌ట్టు శ్వేతాబ‌సుప్ర‌సాద్ చెప్పుకొచ్చింది. ప్రేమ వివాహం కావ‌డంతో పెంచుకున్న అనుబంధంలో ఎన్నో తీపి గుర్తులున్నట్టు.. అవే తనని ఎక్కువగా బాధ పడేలా చేశాయని తెలిపింది. కాని ఆ సమయంలో త‌న‌కు కుటుంబం, స్నేహితులు అండగా ఉన్నారని… అన్నిటికి మించి త‌న‌కు తాను ఓ మంచి స్నేహితురాలిగా మారానని శ్వేతాబ‌సు చెప్పుకొచ్చింది. కాని ఈ వివరణ మాత్రం కొందరికి మరీ వింతగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి సినిమాలలో మళ్ళీ అవకాశాలు వచ్చి శ్వేతాబ‌సుప్ర‌సాద్ కొత్త లైఫ్ మొదలు పెడుతుందేమో.

Advertisement