Rashmi Gautam : విడాకులు తీసుకున్న వ్యక్తితో రష్మీ పెండ్లి.. నీకు ఎవరూ దొరకలేదా..!
NQ Staff - March 21, 2023 / 11:22 AM IST

Rashmi Gautam : యాంకర్ రష్మీకి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ బాగా తెలుసు. ఆమెకు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్-అనుష్క జంటకు ఎంత క్రేజ్ ఉందో.. సుధీర్-రష్మీ జంటకు కూడా అంతే క్రేజ్ ఉంది. వీరిద్దరికీ వీరాభిమానులు కూడా ఉన్నారు. వీరిద్దరూ పెండ్లి చేసుకోవాలని కోరుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు.
కానీ ఇప్పుడు రష్మీ చేసిన పని అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. రెండో పెండ్లి వాడితో రష్మీ పెండ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. సుధీర్ వెళ్లిపోయిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా రష్మీనే చేస్తోంది. యాంకర్ గా ఆమె ఫుల్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు.
రష్మీకి స్వయంవరం..
అయితే తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రష్మీకి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఇందులో ఆమె పెండ్లి కూతురుగా కనిపించింది. అయితే ఆమెను పెండ్లి చేసుకోవడానికి ఓ పెండ్లి అయిన వ్యక్తి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయనతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా చాలా మంది హాజరయ్యారు.
అయితే తనకు రెండో పెండ్లి చేసుకున్న వ్యక్తి నచ్చాడంటూ ఆమె పంచ్ వేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇది చూసిన కొందరు ఆమె నిజంగానే అతన్ని పెండ్లి చేసుకుంటుందేమో అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది.