Kathi Mahesh: కత్తి మహేష్ మరణం పై పలు అనుమానాలు..బ్రతికుండాగానే ఆక్సిజన్ పైప్ పీకేశారా??

Kathi Mahesh: ఈ రోజుల్లో ఆసుప‌త్రికి వెళితే తిరిగి వ‌స్తామో లేదో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. లెజండ‌రీ గాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆసుప‌త్రికి వెళ్లే స‌మ‌యంలో చాలా దృడంగా క‌నిపించారు. కాని చివ‌రికి విగ‌త‌జీవిగా మారారు. క‌త్తి మ‌హేష్ విష‌యంలోను ఇలానే జ‌రిగింది. అత‌నికి ప్రాణాపాయ‌మే లేద‌ని కుటుంబ సభ్యులు,వైద్యులు చెప్పారు. కాని అతను చివ‌రికి శవంగా బ‌య‌టకు వ‌చ్చాడు.

kathi mahesh
kathi mahesh

క‌త్తి మ‌హేష్ ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు చెన్నైలో చికిత్స అందించ‌గా, ఆ స‌మ‌యంలో క‌త్తి మ‌హేష్‌కు ప్రాణాపాయం లేదని ప‌లువురు చెప్పుకొచ్చారు. ఈ విషయం చాలా మంది సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల్లో సంతోషాన్ని నింపింది. చెన్నై హాస్పిటల్‌లో మ‌హేష్‌కు కంటి, బ్రెయిన్, ముఖంపై కలిగిన పలు గాయాలకు చికిత్స చేశారు. జూన్ 26 తేదీ నుంచి ఆయన వెంటిలెటర్‌పైనే ఉంచి చికిత్సను అందించారు. పలు చికిత్సల తర్వాత బ్రెయిన్‌‌కు ఎలాంటి గాయాలు కాలేదని, అలాగే రక్తస్రావం కూడా జరుగలేదనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు.

ఊప‌రితిత్తుల‌లో నీరు చేర‌డం, ఒబెసిటీ వ‌ల‌న క‌త్తి మ‌హేష్ ఆరోగ్య‌ప‌రిస్థ‌తి విష‌మంగా మారింది. అయితే ఊపిరితిత్తుల‌లో ర‌క్తం చేరింద‌ని గ్ర‌హించిన వైద్యులు ఆయ‌న‌కు చికిత్స చేసే ప్ర‌క్రియ‌లో క‌త్తి మ‌హేష్ ఈ లోకం నుండి వెళ్లిపోయాడు. అయితే కత్తి మహేష్ మరణంపై సోషల్ మీడియాలోను, వెబ్ మీడియాలోను అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన మరణానికి ముందు వెంటిలేటర్ తొలగించారు? ఆక్సిజన్ అందించడం ఆపేశారనే విషయం భారీ చర్చకు దారి తీసింది.

కత్తి ఆరోగ్యం బాగానే ఉంది. ఆయన చికిత్సకు బాగానే స్పందించాడు కూడా. వైద్యులు కూడా ఇదే చెప్పారు. మామూలు మనిషి కావడానికి కాస్త సమయం పడుతుంది కానీ ప్రాణాపాయం మాత్రం లేదని వైద్యులు అన‌గా, చివ‌రికి విగ‌త‌జీవిగా బ‌య‌ట‌కు రావ‌డంపై అంద‌రిలో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. అయితే ఆక్సిజన్, వెంటిలెటర్ తొలగింపు విషయంపై వైద్యులు నివేదిక ఇస్తే గానీ అనుమానాలకు తెరపడదని కొంద‌రు అంటున్నారు.

క‌త్తి మ‌హేష్‌ని కాపాడ‌డానికి వైద్యులు కూడా బాగానే క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. మ‌రో వైపు ఏపీ ప్ర‌భుత్వం కూడా 17 ల‌క్ష‌లు రిలీజ్ చేసింది. ఆయ‌న‌ను కాపాడడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగినా కూడా చివ‌రికి తుదిశ్వాస విడిచారు. మహేష్ కత్తి అంత్యక్రియలను వాయల్పాడుకు సమీపంలోని తన స్వగ్రామంలో నిర్వహించే అవకాశం ఉంది.