Sushanth : ఘోరాతి ఘోరం.. సుశాంత్ సింగ్ ఇంట తీవ్ర విషాదం, ఆరుగురు క‌న్నుమూత‌

Sushanth : బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం యావత్ సినీ లోకానికి, అతని అభిమానులకు ఎనలేని దుఃఖాన్ని మిగిల్చింది. ఇప్ప‌టికీ అభిమానులు సుశాంత్ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే తాజాగా బీహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్‌ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

TheNewsQube-
Sushanth Singh Rajput relatives death in road accident
Sushanth Singh Rajput relatives death in road accident

సుశాంత్‌ బంధువు ఓం ప్రకాశ్‌ సింగ్‌ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా లఖిసరాయ్‌ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ బంధువులు ప్రయాణిస్తున్న సుమో.. ట్రక్‌ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమోలో మొత్తం పది మంది ఉన్నారు.

వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో సుశాంత్‌ మేనల్లుడు సహా, బావా, హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ ఓం ప్రకాష్‌ సింగ్‌ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గతేడాది జూన్‌ 14న ముంబయి, బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం వెనకాలనే అనేక కోణాలున్నట్టు వార్తలొచ్చాయి. డ్రగ్స్ కోణం, మాఫియా, ప్రియురాలు మోసం చేసిందని, ఇలా నానా రకాలుగా ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌లో నెపోటిజం కూడా సుశాంత్‌ మరణానికి కారమన్నారు.

ఇక సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ `ఎంఎస్‌ధోని` చిత్రంతో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇందులో ధోనీ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. 2013లో `కయి పో చె` చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైన సుశాంత్‌ `శుద్ద్‌ దేశీ రొమాన్స్`, `పీకే`, `ఎంఎస్‌ధోనిః ది అన్‌టోల్డ్ స్టోరీ`, `రాబ్తా`, `వెల్‌ కమ్‌ టూ న్యూయార్క్`, `కేథార్‌నాథ్‌`, `సోంచారియా`, `చిచ్చోర్`, `డ్రైవ్‌`, `దిల్‌ బెచారా` చిత్రాల్లో నటించారు.