Surya : సూర్య బ్లాక్ బస్టర్ సిరీస్‌కి రంగం సిద్దం..!

Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళంలో నటించిన కాప్ మూవీ సింగం. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటికే మూడు భాగాలు వచ్చి వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు సూర్య. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు ఒకదానికి మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడమే కాదు సూర్య ఇమేజ్‌ను కూడా అమాంతం పెంచాయి. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా సింగం సిరీస్‌కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ కాంబినేషన్‌లో ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ఇప్పుడు దర్శకుడు హరి సింగం 4 ప్లాన్ చేస్తున్నాడట.

surya-block-buster-singam-movie-series-is-getting-ready
surya-block-buster-singam-movie-series-is-getting-ready

సూర్య గత చిత్రం సూరారై పోట్రు..తెలుగులో ( ఆకాశం నీ హద్దురా ) సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో సూర్య ఇప్పుడు వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్నాడు. ఇప్పటికే పాండిరాజ్, టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ఓకే చేసినట్టు కోలీవుడ్ మీడియా సమాచారం. ఈ క్రమంలోనే సింగం 4 చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేయమని హరికి సూర్య చెప్పాడట.

Surya : సూర్య సింగం 4 పాన్ ఇండియన్ రేంజ్‌లో..!

దాంతో సూర్య ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా గత మూడు భాగాల కంటే భారీ స్థాయిలో ఉండేలా సింగం 4 కథ ఉండబోతోందట. అంతేకాదు ఈసారి తెరకెక్కబోతున్న సింగం 4 పాన్ ఇండియన్ రేంజ్‌లో కథ సిద్దం చేస్తున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీశ్రీప్రసాద్ కంటిన్యూ అవబోతున్నాడట. హీరోయిన్‌గా అనుష్క శెట్టి నటిస్తుందా లేదా అనేది మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సెకండ్ హీరోయిన్స్‌గా సింగం 2,3లలో హన్సిక మొత్వానీ, శృతి హాసన్ నటించారు. మరి సింగం 4లో కూడా సెకండ్ హీరోయిన్ ఉంటుందా లేదా చూడాలి.