Surender Reddy: ఏజెంట్ : స్క్రిప్ట్ విషయంలో జోక్యం వద్దంటూ సూరి విజ్ఞప్తి
NQ Staff - September 22, 2022 / 06:48 PM IST

Surender Reddy: అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా వస్తుందంటూ హడావిడి చేశారు, కానీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యే సమయం కు ఔట్‌పుట్ సరిగా రాలేదంటూ మళ్లీ రీ షూట్ కి వెళ్లారు అంటూ గుసగుసలు వినిపించాయి.
ఆ విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ
ఇప్పుడు సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది, అందుకు కారణం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని బ్యాలెన్స్ వర్క్ చాలా ఉండడంతో ఆలస్యం అవుతుంది అంటూ పేర్కొన్నారు.

Surender Reddy Said There No Change The Script
మొన్న ఆగస్టులో సినిమా విడుదల అదిగో ఇదిగో అన్నట్లుగానే హడావుడి చేశారు కానీ జరగలేదు. ఆగస్టులో విడుదల అవ్వని సినిమా కనీసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో నైనా విడుదలవ్వాలి కదా అంటూ అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఈ సమయంలోనే దర్శకుడు సురేందర్ రెడ్డి తాను రెడీ చేసుకున్న స్క్రిప్ట్ విషయంలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు అంటూ నిర్మాతలకు విజ్ఞప్తి చేశాడట, ఇప్పటికే పలు సార్లు నాగార్జున మరియు అక్కినేని కాంపౌండ్ కు చెందిన కొందరు స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేయడంతో ఇంత ఆలస్యమైందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అందుకే ఇక నాగార్జుననే కాదు మరెవ్వరు స్క్రిప్ట్ లో మార్పు చెప్పిన కూడా తాను చేయబోనంటూ సురేందర్ రెడ్డి గట్టిగా చెప్పేశాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నాగార్జున మాత్రమే కాకుండా ఇతరులు ఔట్ పుట్ విషయంలో బాధ్యత తీసుకోరు.. తాను మాత్రమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది, కనుక తన స్క్రిప్ట్ వర్క్ తానే చేసుకుంటానని సురేందర్ రెడ్డి నిర్మాతలకు తెగేసి చెప్పాడట. మొత్తానికి ఈ ప్రాజెక్టు కాస్త గందరగోళంగా సాగుతోంది. చివరికి ఏమవుతుందో చూడాలి.