Surekha Vani: కూతురితో మాస్ డ్యాన్స్ వేసిన సురేఖా వాణి.. బాబోయ్ ఇదేమి రచ్చ..!
Tech Sai Chandu - October 22, 2021 / 03:00 PM IST

Surekha Vani క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సురేఖా వాణి ఇటీవల సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. వెండితెరపై సురేఖా వాణి తన నటనతో ఎంత హంగామా చేస్తారో.. సోషల్‌మీడియాలో సుప్రిత అంతే హంగామా చేస్తారు. తరచూ డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేసుకుంటూ ఆమె అభిమానులను అలరిస్తూ ఉంటారు.
కూతురితో సమానంగా సురేఖా కూడా డ్యాన్స్ వీడియోలలో చిందులు వేస్తుంటారు. వీళ్లద్దరి అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అందుకే పోస్ట్ చేసిన కొంత సమయంలోనే ఈ వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా సురేఖా, సుప్రిత ఇద్దరు కలిసి మాస్ డ్యాన్స్ చేశారు.
ఓ రేంజ్‌లో వేస్తున్నవీరి డ్యాన్స్ అందరి మతులు పోగొడుతుంది.ప్రస్తుతం సురేఖా, సుప్రిత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కూతురుతో కలిసి సురేఖా వాణి స్టెప్ వేసిందంటే ఆన్ లైన్ వేదికలు షేక్ కావాల్సిందే. ఇప్పటికే ఎన్నోసార్లు అలా సోషల్ మీడియాలో హంగామా చేశారు ఈ ఇద్దరూ.
సురేఖా వాణి కూతురు సుప్రిత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె నెట్టింట్లో ఎంతో మంది అభిమానులున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాట్లు పెడుతూ… తన ఫాలోవర్లతో ముచ్చటలను పెడుతూ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇక ఎప్పుడూ నెట్టింట్లో హల్చల్ చేస్తూ.. ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న సుప్రిత త్వరలోనే సినీ అరంగేట్రం చేయబోతుంది.
సురేఖా విషయానికి వస్తే.. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సురేఖా వాణి యాక్టివ్‌గా ఉంటుంది.