Surekha Vani: సురేఖా వాణి రెండో పెళ్లి .. విషయం ఇలా బయటపడింది..!
Tech Sai Chandu - October 17, 2021 / 03:44 PM IST

Surekha Vani: క్యారెక్టర్ సురేఖ వాణి ఇటీవలి కాలంలో చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చతో తెగ పాపులారిటీ సంపాదించుకుంది. కూతురితో కలిసి ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే సురేఖ వాణి రెండో వివాహం గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్న పలు సందర్భాలలో ఆమెకు ఎదురు కాగా, దానిని సున్నితంగా తిరస్కరించింది.
అయితే సురేఖావాణి ఎప్పటికప్పుడు తన ఫోటోలు, తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, అలాగే వెకేషన్ లో వున్న ఫోటోలు అప్లోడ్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లూ కలర్ సారీ లో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఫోటోలో సురేఖ వాణి మెడలో తాళిబొట్టు కనిపించడమే.
భర్త చనిపోయిన తరువాత స్త్రీలు తాళిబొట్టు తీసివేస్తారు. కానీ సురేఖ వాణి మెడలో తాళిబొట్టు కనిపిస్తూ ఉండటంతో ఒకవేళ ఆమెకు రెండో వివాహం ఏమైనా జరిగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వతహాగా ఆమె నటి కావడంతో ఏదైనా సినిమాకు సంబంధించిన పాత్ర అయ్యుండొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికితే అలా ఫోటో తీసుకుని అప్లోడ్ చేసి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సురేఖ వాణి చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడి వివాహం చేసుకుంది.. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖ వాణి ఆ తర్వాత సీరియల్స్ లో నటించి నెమ్మదిగా సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో సీరియల్స్ కి దర్శకత్వం వహించే సురేష్ తేజ అనే దర్శకుడుతో ప్రేమలో పడి ఆయననే పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంది. దురదృష్టవశాత్తూ సురేష్ తేజ కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్య కారణాలతో మరణించారు.