Surekha Vani: రెండో పెళ్ళిపై స్పందించిన సురేఖ వాణి.. పెళ్లెప్పుడంటే..?

టాలీవుడ్‌లో జోరుగా పెళ్లిళ్ళ హంగామా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కొంద‌రు సెల‌బ్రిటీలు తొలిసారి పెళ్లి పీట‌లెక్క‌గా, మ‌రి కొంద‌రు సెకండ్ మ్యారేజ్ చేసుకొని షాక్ ఇచ్చారు. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు లాక్ డౌన్ స‌మ‌యంలో సింపుల్‌గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.ఇక ఈ ఏడాది ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత.. వ్యాపారవేత్త, మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లాడింది. వీరి పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేశాయి. ఇక ఇప్పుడు క్యారెక్ట‌ర్ సురేఖా వాణి రెండో పెళ్లిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఆ మ‌ధ్య సురేఖా భ‌ర్త అనారోగ్యంతో మృతి చెంద‌గా సురేఖ త‌న కూతురితో సోలోగా ఉంటుంది. కుటుంబ స‌భ్యుల కోరిక మేర‌కు ఆమె రెండో పెళ్లికి సిద్ద‌మైంద‌ని ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హల్‌చ‌ల్ చేస్తున్నాయి.

సురేఖా వాణి రెండో పెళ్లిపై పుకార్లు ఎక్కువ‌వుతున్న నేప‌థ్యంలో ఆమె త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. తన రెండో పెళ్లిపై ఓ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన వార్త ఫేస్‌బుక్ పోస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఇది ఫేక్ అని పేర్కొంది. అలానే త‌న పేరుతో ప‌లు ఫేస్ బుక్ అకౌంట్స్ ద‌ర్శ‌న‌మిస్తుండ‌డంతో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చింది. నాకు ఎలాంటి ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ అకౌంట్స్ లేవంటూ వివ‌ర‌ణ ఇచ్చింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని వెల్లడించారు. కాగా, సురేఖ వాణికి సుప్రీత అనే కూతురు ఉండ‌గా, ఆమెతో క‌లిసి సురేఖ చేసే సంద‌డి అంతా ఇంతా కాదు.

ఒక‌ప్పుడు సురేఖ వాణి తెలుగు సినిమాల‌లో ఎక్కువ‌గా క‌నిపించేది. కాని ఈ మ‌ధ్య ఆమె జోరు త‌గ్గింది. రీసెంట్‌గా ‘డర్టీ హరి’ సినిమాలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సురేఖవాణి నటిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘మాస్టర్’ సినిమాలో సురేఖవాణి నటించారు. ఆమె కెరీర్‌లో భద్ర, శ్రీమంతుడు, దుబాయ్ శీను, బృందావనం ఇలా ఎన్నో చిత్రాల‌లో సురేఖ వాణి న‌టించింది. కొన్ని ద‌శాబ్ధాలుగా ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఇప్పుడు సినిమాలు త‌గ్గడంతో సోష‌ల్ మీడియా ద్వారా అల‌రిస్తుంది.

Advertisement