Surekha Vani: గుండె ప‌గిలిందంటూ పోస్ట్ పెట్టిన సురేఖా వాణి.. ఎందుకో తెలుసా?

Surekha Vani: నాగ చైత‌న్య‌- స‌మంత జంట టాలీవుడ్ క్రేజీ క‌పుల్స్‌లో ఒక‌టి. నాగచైతన్య, సమంత జంటగా నటించిన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఈ సినిమా స‌మయంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. విషయం బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. మెల్లమెల్ల‌గా ఆ విష‌యాన్ని ఇంట్లో తెలియ‌జేసి ఎట్ట‌కేల‌కు పెళ్లి పీట‌లెక్కారు.

Surekha Vani Got Emotional on Chay-Sam Divorce
Surekha Vani Got Emotional on Chay-Sam Divorce

స‌మంత‌- నాగ చైత‌న్య జంట‌ని చూసి చాల మంది మురిసిపోయారు. ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నార‌ని కామెంట్ పెట్టారు.అయిత వారు ఇలావిడిపోవ‌డం చాలా బాధాక‌రం. తామిద్దరం ఇక భార్యభర్తలుగా ఉండబోవడం లేదని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలిసి ఉంటామని నాగ చైతన్య, సమంత కన్ఫర్మ్ చేసిన కొద్ది సేపటికే నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు.

”బరువెక్కిన గుండెతో ఈ విషయం మీతో చెబుతున్నా. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. భార్యభర్తలైన చై- సామ్ మధ్య జరిగింది పర్సనల్. ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిద్దరికి బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను” అంటూ పోస్ట్ పెట్టారు.

అయితే తాజాగా నాగార్జున పెట్టిన ఇదే పోస్ట్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సురేఖావాణి.. నాగ చైతన్య- సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సింది.. చాలా బాధగా ఉంది అని సురేఖ అన్నారు. వారి డైవ‌ర్స్ అంశం ప్ర‌తి ఒక్క‌రికి చాలా బాధ‌ను క‌లిగిస్తుంది.