Surekha Vani: త‌న కూతురు వెండితెర ఎంట్రీపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సురేఖా వాణి

Samsthi 2210 - July 31, 2021 / 02:48 PM IST

Surekha Vani: త‌న కూతురు వెండితెర ఎంట్రీపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సురేఖా వాణి

Surekha Vani: క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు ప‌లు భాష‌ల‌లో సినిమాలు చేసిన సురేఖా వాణి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది.

Surekha Vani

త‌ల్లితో పాటు కూతురు పేరు కూడా అప్పుడ‌ప్పుడు వార్త‌ల‌లోకి ఎక్కుతుంది. త‌ల్లీకూతుళ్లు ఇద్ద‌రు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుండ‌గా, ఆ సందడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఇక ఇద్దరూ కలిసి చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. చీరకట్టుతో ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలా సురేఖా వాణికి తగ్గ క్రేజ్‌ను సుప్రిత సొంతం చేసుకున్నారు.

అయితే సుప్రిత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండటంతో అంతే స్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ట్రోలర్లపై సుప్రితపై మండిపడే తీరు కూడా వివాదాలకు దారి తీస్తుంటారు. అయితే ఈ అమ్మ‌డు సినిమాల‌లోకి ఎంట్రీ ఇస్తుందని కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. దీనిపై సురేఖా కాని, సుప్రిత కాని ఏ రోజు పూర్తి క్లారిటీ ఇవ్వ‌లేదు.

తాజాగా సురేఖావాణి ఓ ఇంట‌ర్వ్యూలో కూతురి వెండితెర ఎంట్రీపై ప‌క్కా స‌మాచారం అందించింది. . ప్రస్తుతం సుప్రీత చదువుపై దృష్టి పెడుతోంది. దాంతో పాటు ఆమె నటనతో డాన్సుల్లో ఓ గురువు దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది.డైలాగు డెలావరిలో ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండడానికి ఓ మాస్టర్ దగ్గర ఎంచాక్కా తెలుగు పాఠాలు కూడా నేర్చుకుంటోంది.సుప్రీత హీరోయిన్‌గా ఎంట్రీ పై నేనే మీడియాకు తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చింది.

కూతురి తెరంగేట్రంపై సురేఖా వాణి ఇచ్చిన క్లారిటీతో అయిన పుకార్లకు బ్రేక్ ప‌డుతుందా అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే సురేఖా వాణి భర్త, సుప్రీత తండ్రి సురేష్ తేజ అనారోగ్యంతో మరణించిన సంగతి మనందరికీ తెలుసు. అప్పటినుంచి కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతుంది సురేఖ‌. ఇటీవలి కాలంలో తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలను ఖండించింది. ఇదే విషయమై ఆమె కూతురు సుప్రిత కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us