Surekha Vani : సినిమా ఛాన్సులెందుకు రావట్లేదు.? సురేఖా వాణి సమాధానమేంటో తెలుసా.?
NQ Staff - October 7, 2022 / 05:47 PM IST

Surekha Vani : చాలాకాలం తర్వాత సినీ నటి సురేఖా వాణి ఓ సినిమా సక్సెస్ మీట్‌లో కనిపించింది. ‘సురేఖ ఆంటీ’ అంటూ ఆమె పేరు నిత్యం సోషల్ మీడియాలో మార్మోగుతూనే వుంటుంది. ట్రోలింగ్ అనండీ, ఆమె అందాన్ని ఆరాధించేవాళ్ళనండీ.. ఎవరైతేనేం, ఆమె పేరుని అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ‘లైవ్’గా వుంచుతుంటారు.
ఇంతకీ, సురేఖా వాణి ఇటీవలి కాలంలో ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయడంలేదు.? సినిమాల్లో కనిపించడం ఎందుకు తగ్గించేసింది.? సినిమాల్ని మానేసినట్లేనా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.
అవకాశాలు నా వరకూ రావట్లేదు: సురేఖా వాణి
‘స్వాతిముత్యం’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సురేఖా వాణి ఆ సినిమా సక్సెస్ మీట్‌లో మనసు విప్పి మాట్లాడింది. ‘అవకాశాలు నా వరకూ రావడంలేదు. ఎందుకో నాకు తెలియదు. ఈ సినిమాలో మంచి అవకాశం వచ్చింది.. ఆ పాత్రకి మంచి పేరు కూడా వచ్చింది..’ అంటూ సురేఖా వాణి ఒకింత ఎమోషనల్ అయ్యింది.
‘నేను సినిమాలు మానెయ్యలేదు.. దర్శకులూ మమ్మల్ని గుర్తు పెట్టుకోండి..’ అంటూ సురేఖా వాణి ‘స్వాతిముత్యం’ సినిమా సక్సెస్ మీట్ వేదికగా అభ్యర్థించడం గమనార్హం.
కొన్నాళ్ళ క్రితం సురేఖా వాణి భర్త అనారోగ్యంతో కన్నుమూశాక, ఆమె సినిమాల్లో నటించడం తగ్గిపోయింది. కానీ, ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం హల్‌చల్ చేస్తూనే వుంటాయ్.