Supritha: గూగుల్‌లో సురేఖా వాణి కూతురు ఇలాంటివి వెతుకుంద‌ట‌..!

Supritha: క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇటీవ‌లి కాలంలో ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ కూతురితో చేసే ర‌చ్చ‌కు సంబంధించిన విష‌యాల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సురేఖావాణి త‌న ప‌ర్స‌న‌ల్ ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా త‌న భ‌ర్త విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు క‌న్నీరు పెట్టుకుంది.

Supritha

ఒక ర‌కంగా చెప్పాలి అంటే సురేఖా వాణి క‌న్నా ఆమె కూతురు సుప్రిత‌కు ఫాలోయింగ్ బాగా ఉంది. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నందున బోర్ కొడుతోందని తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతున్నారు. అందులో భాగంగా సుప్రిత తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఓ నెటిజన్ తను చివరిసారిగా గూగుల్లో ఏం వెతికావని ప్రశ్నించగా వెంటనే సుప్రీత తన గూగుల్ సెర్చ్ హిస్టరీ ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసింది.

సుప్రిత షేర్ చేసిన స్క్రీన్ షాట్‌తో తన ఫోన్ కి సంబంధించిన చార్జర్, యాపిల్ ఫోన్ అకౌంట్ విషయాలను సర్చ్ చేసినట్లు తెలిసింది. ఆ మ‌ధ్య చాటింగ్ స‌మ‌యంలో ఆర్ యూ వర్జిన్ అంటూ ఓ ఆకతాయి ప్రశ్నించారు. దీనిపై సుప్రిత ఫైర్ అవుతూ వకీల్ సాబ్ స్టైల్లో చిందులు తొక్కారు. అబ్జెక్షన్ అంటూ పవన్ కళ్యాణ్ కోర్టులో అసహనం వ్యక్తం చేసిన సీన్‌ను షేర్ చేశారు.

Supritha

పవన్ కళ్యాణ్ అంటేనే ఎప్పటికీ ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చిన సుప్రిత త‌న సోష‌ల్ మీడియాలో త‌ల్లితో చేసే సంద‌డికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. తన తల్లి ద్వారా సెలబ్రిటీగా మారిన ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తన ఫాలోవర్స్ విప‌రీతంగా పెంచుకుంది.రెగ్యుల‌ర్‌గా వారితో ముచ్చ‌టిస్తూనే ఉంది.

ఆ మ‌ధ్య త‌న త‌ల్లి రెండో పెళ్లికి సంబంధించి కొంద‌రు కామెంట్స్ చేయ‌గా, వారి ఏకి పారేసింది. నోటికొచ్చిన తిట్లు తిడుతూ ఇంకోసారి త‌న జోలికి రాకుండా చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మడు న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. వీలైనంత త్వ‌ర‌లోనే వెండితెర ఎంట్రీ ఇవ్వాల‌ని సుప్రిత భావిస్తుంద‌ట‌. ఇప్ప‌టికే సుప్రిత పలు షార్ట్ ఫిలింస్‌తో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల‌లో న‌టించింది.