Surekha Vani: మందు బాటిల్స్‌తో గోవాలో ర‌చ్చ‌.. తాగుబోతులంటూ ట్రోల్స్

Samsthi 2210 - August 16, 2021 / 05:04 PM IST

Surekha Vani: మందు బాటిల్స్‌తో గోవాలో ర‌చ్చ‌.. తాగుబోతులంటూ ట్రోల్స్

Surekha Vani: క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఈ మ‌ధ్య త‌న కూతురు సుప్రిత‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్‌లు చేయ‌డం, ప‌బ్‌ల‌కి వెళ్లి పార్టీల‌కు వెళ్లి ర‌చ్చ చేయ‌డం వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డం వంటివి చేస్తున్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా ఈ ఇద్ద‌రు చేసే ర‌చ్చ రాను రాను పీక్స్‌కి చేరుకుంటుంది. ముఖ్యంగా సురేఖా కూతురు సుప్రిత ఓ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది.

Surekha Vani

సురేఖా కూతురు సుప్రిత నాయుడు త్వరలో హీరోయిన్‌గా బడా హీరో, బడా బ్యానర్‌ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై స్పందించిన సురేఖా వాణి ప్ర‌స్తుతం త‌ను శిక్ష‌ణ తీసుకుంటుంద‌ని,స‌మ‌యం సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు నేనే త‌న ఎంట్రీకి సంబంధించి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది సురేఖా. ఇదిలాఉంటే తమ ఇంట్లో పుట్టినరోజు వేడుక అంటే బ‌య‌ట‌కి వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ వ‌స్తున్నారు త‌ల్లీ కూతుళ్లు.

సుప్రిత నాయుడు పుట్టినరోజు సందర్భంగా గోవా టూర్ వేసి అక్కడే బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేశారు. గోవాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ చుట్టేస్తూ ఛిల్ అయ్యారు. స్నేహితులతో మందు పార్టీ కూడా చేసుకున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది సుప్రిత. ఈ ఫొటోల్లో సురేఖావాణి కూడా కనిపించింది. టేబుల్స్ పై మందుబాటిల్స్ క‌నిపించ‌డంతో ఫుల్‌గా ట్రోల్ చేశారు.

Surekha Vani

తాగుబోతుల్లా తయార‌వుతున్నారు. సొసైటీలో ఇలాంటి అమ్మాయిల కూడా ఉన్నారా. కూతురికి తోడు త‌ల్లి కూడా త‌యారైంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌కి త‌ల్లీ కూతుళ్లు ఏమైన స‌మాధానం ఇస్తారా అనేది చూడాలి. సురేఖా వాణి.. తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖా వాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us