Surekha : ముద్దుల్లో ముంచేస్తోంది.. సురేఖా వాణి కూతురి వీడియో వైరల్

Surekha సురేఖా వాణి తన కూతురు సుప్రితను సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ చేసిందో అందరికీ తెలిసిందే. డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ మొదటగా పాపులర్ అయ్యారు. కాలా చష్మా అనే పాటకు బెడ్రూంలో ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో లీక్ అవ్వడంతో వార్తల్లోకెక్కారు. అప్పటి వరకు సురేఖా వాణిని ఎవ్వరూ కూడా అలా చూసి ఉండరు. బుల్లి నిక్కర్ వేసుకుని ఉండటం, పక్కనే కూతురిని పెట్టుకుని రచ్చ చేయడంతో అది తెగ వైరల్ అయింది.

అలా సురేఖా వాణి తన కూతురు సుప్రితను ఎప్పుడూ కూడా లైమ్ లైట్‌లో ఉండేలా చూసుకుంటూ వచ్చింది. ఆ తరువాత టిక్ వీడియోలతో సురేఖా వాణి మరింత రచ్చ చేసింది. అందులో సురేఖా వాణి కంటే ఎక్కువగా సుప్రిత ఫేమస్ అవ్వడం ప్రారంభించింది. తన కంటూ సపరేట్ ఫాలోయింగ్ క్రేజ్ ఏర్పడింది. అలా సుప్రిత కూడా సోషల్ మీడియాలో రచ్చ చేయడం ప్రారంభించింది.

ఆమె కూడా తన ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంది. నిత్యం అప్డేట్లు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇక ట్రోలింగ్‌కు సైతం తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. నెగెటివ్ కామెంట్లు చేసే వారికి గట్టిగానే రివర్స్ కౌంటర్ వేస్తుంది. ఓ సారి అలానే సుప్రిత‌కు స్పెల్లింగ్స్ కూడా రావు అంటూ నెగెటివ్ కామంట్లు వచ్చిన సమయంలో గట్టిగా రియాక్ట్ అయింది. మీ పని మీరు చూసుకోండంటూ ట్రోలర్స్‌కు పంచ్ వేసింది.

సుప్రిత తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలంటూ రచ్చ చేస్తుంది. తాజాగా సుప్రిత తన స్నేహితురాలి బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన ఫ్రెండ్స్‌ను ముద్దులతో ముంచెత్తింది. అంతేకాకుండా ఓ ఫేమస్ డైలాగ్‌ను పేరడి చేస్తూ పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ బర్త్ డే తనకు విషెస్ చెప్పండి అని చెబుతూ.. టిక్ టాక్ ఫేమ్ డైలాగ్‌తో కౌంటర్ వేసింది. ప్రెండ్స్ ఈ రోజు ఈ అమ్మాయి బర్త్ డే అందరు విష్ చేయండి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement