Surekha Vani: మ‌రోసారి వార్త‌ల‌లోకి సురేఖ వాణి రెండో పెళ్లి.. వైర‌ల్‌గా మారిన పోస్ట్

Surekha Vani క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ సురేఖా వాణికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. కాని సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. త‌న భ‌ర్త చనిపోయిన‌ప్ప‌టి నుండి సురేఖా వాణి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కూతురితో కలిసి ప‌లు వీడియోలు చేయ‌డం, విహార యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ దిగిన ఫొటోల‌ను షేర్ చేయ‌డం వంటివి చేస్తూ నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తుంది.అయితే ఎన్నో సినిమాలలో వదినగా, అక్కగా, చెల్లిగా, తల్లి వంటి పాత్రల్లో నటించిన సురేఖ వాణి.. యాంకర్ గా కూడా పని చేసింది.

Surekha Vani

సురేఖా వాణి పోస్ట్‌ల‌ పై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ అవేమి ప‌ట్టించుకోకుండా నిత్యం పోస్ట్‌లు పెడుతూనే ఉంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. అంతే కాకుండా ఓ ఫోటో కూడా షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ప్రేమ‌కు వ‌య‌స్సుతో ప‌ని లేదు అంటూ తమ కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటలను ఫోటోలను షేర్ చేసింది. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ తో పాటు ప‌లువురు హాలీవుడ్ జంట‌లు ఉన్నాయి. దీనిని బ‌ట్టి చూస్తుంటే సురేఖా వాణి తనకంటే చిన్న వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందేనని అంద‌రిలో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

18 ఏళ్లకే పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యానని ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చిన సురేఖా వాణి, తను 38 ఏళ్ళ కే తన భర్తను కోల్పోగా.. ఇటీవలే 40 వ పుట్టినరోజు జరుపుకుంది. ఆ రోజు త‌న కూతురితో క‌లిసి తెగ సంద‌డి చేసింది. అయితే తను మరో పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు రాగా.. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో చూపించండి అంటూ.. అంతేకాకుండా డబ్బు ఉన్న వ్యక్తిని చూపించమని కోరింది. మనసుతో పనేముంది అంటూ.. మనసుతో పనులు జరగవని తోసిపుచ్చింది. ఇటీవల విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో సురేఖా వాణి నటించగా తనను ఎడిటింగ్ లో తొలగించారని తెలిపింది. కానీ ఓటీటీ లో యాడ్ చేశారని.. తాను నటించిన సన్నివేశాలు బాగున్నాయని.. సినిమా చూసిన వాళ్ళు చెప్పారని తెలిపింది.