Supreme Court : థియేటర్‌లోనికి బయట ఫుడ్ అనుమతి పై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు
NQ Staff - January 3, 2023 / 10:24 PM IST

Supreme Court : ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి అంటే 500 రూపాయల టికెట్ కు ఖర్చు చేయాలి మరియు 500 రూపాయలు లోపల తిను బండారాలకు ఖర్చు అవుతుంది అంటూ సామాన్య ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
చిన్న పిల్లలను వెంట తీసుకు వెళుతున్న సమయంలో వారికి కచ్చితంగా సినిమా సమయంలో తినుబండారాలు కొనియాల్సి ఉంటుంది. అక్కడ తినుబండారాలు రుచికరంగా ఉండక పోవడంతో పాటు ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఉంటున్నాయి.
పైగా మల్టీ ప్లెక్స్ లో కొనుగోలు చేస్తున్న తినుబండారాల రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. అందుకే కొందరు థియేటర్లకి బయటి ఫుడ్ ని, సొంత ఫుడ్ ని అనుమతించాలని కోరుతున్నారు.
తాజాగా ఈ విషయమై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదోపవాదాలు జరిగాయి. థియేటర్ లోకి బయటి ఆహారం ని అనుమతిస్తూ థియేటర్లను ఆదేశించలేమని న్యాయస్థానం పేర్కొంది.
పిల్లలకు ఉచిత ఆహారం మంచి నీరు ఇవ్వాలని మాత్రం ఇప్పటికే సినిమా థియేటర్స్ యొక్క యాజమాన్యాలను ఆదేశించామని ధర్మాసనం గుర్తు చేసింది.
సినిమా చూడాలనుకున్నప్పుడు థియేటర్ ని ఎంపిక చేసుకోవడం ప్రేక్షకుడి యొక్క హక్కు.. అలాగే థియేటర్ యాజమాన్యం తమ యొక్క థియేటర్ లో రూల్స్ పెట్టడం వారి హక్కు. అందుకే ఈ విషయంలో తమ జోక్యం ఉండదని ధర్మసనం పేర్కొంది.