Ram charan : రామ్ చరణ్ సినిమాలో సూపర్ స్టార్స్..?

Ram charan : రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నా సంగతి తెలిసిందే. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఆచార్య చేస్తున్న చరణ్ ఇటీవలే పూజా హెగ్డే తో కలిసి ఒక సాంగ్ కంప్లీట్ చేశారు. ఇటు ఆచార్య, అటు ఆర్ ఆర్ ఆర్ సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే చరణ్ తన నెక్స్ట్ సినిమాలన్ని పాన్ ఇండియన్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

supr stars in ram-charan movie
supr stars in ram-charan movie

ఈ క్రమంలోనే క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ త్వరలో సెట్స్ పైకి రానున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను శిరీష్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇక చరణ్ ని యువ ఐఏఎస్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే సీఎం పాత్రతోనూ కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది.

Ram charan : రామ్ చరణ్ సినిమాలో 4 సూపర్ స్టార్స్..?

అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నాలుగు భాషల్లో నలుగురు ప్రముఖ స్టార్లను ఎంపిక చేస్తున్నారట. హిందీ వెర్షన్ కోసం సల్మాన్ ని సంప్రదించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మెగా కాంపౌండ్ తో చరణ్ తో అనుబంధం కారణంగా సల్మాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. కన్నడలో ఉపేంద్ర లేదా సుదీప్..తమిళంలో విజయ్ సేతుపతి..తెలుగులో మెగాస్టార్ లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే ఆర్ ఆర్ ఆర్ సినిమాని మించిన భారీ మల్టీస్టారర్ అవడం ఖాయంటున్నారు

Advertisement