Rajinikanth: సూపర్ స్టార్ అప్డేట్: రజనీకాంత్‌తో రెండు భారీ చిత్రాలు ప్రారంభించనున్న ‘లైకా’.!

NQ Staff - October 28, 2022 / 09:01 PM IST

Rajinikanth: సూపర్ స్టార్ అప్డేట్: రజనీకాంత్‌తో రెండు భారీ చిత్రాలు ప్రారంభించనున్న ‘లైకా’.!

Rajinikanth: సౌత్ సినీ పరిశ్రమలో ‘లైకా’ సంస్థ పేరు చెప్పగానే అత్యంత భారీ చిత్రాలు గుర్తుకొస్తాయ్. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో గతంలో ‘రోబో 2.0’ సినిమాని ఇదే సంస్థ తెరకెక్కింది. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాని కూడా ఈ సంస్థే నిర్మించింది. ప్రస్తుతం ‘ఇండియన్-2’ సినిమానీ అలాగే ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2’నీ తెరకెక్కించే పనిలో బిజీగా వుంది లైకా సంస్థ.

తాజాగా ఈ సంస్థ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లైకా సంస్థ అధినేత తమిళకుమరన్ కీలక ప్రకటన చేశారు.

నవంబర్ 5న రెండు సినిమాలు.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

నవంబర్ 5వ తేదీన రెండు సినిమాల్నీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు తమిళకుమరన్ ప్రకటించారు. ఈ మేరకు రజనీకాంత్‌ని ‘లైకా’ టీమ్ కలిసింది. లైకా ప్రొడక్షన్స్ ఛైర్మన్ సుబాస్కరన్, డిప్యూటీ ఛైర్మన్ ప్రేమ్ శివస్వామి కూడా రజనీకాంత్‌తో భేటీలో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాలు వుండబోతున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

రజనీకాంత్‌తో సినిమా నిర్మించడమంటే ఏ నిర్మాతయి అయినా అదో పండగ అనీ, తాము అలాంటి అనుభూతిని గతంలోనే చెందామనీ.. ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఆయనతో సినిమాలు నిర్మించబోతున్నామని లైకా టీమ్ చెబుతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us