Mahesh Babu : కృష్ణ హార్ట్‌ ఎటాక్.. అదే సమయంలో మహేష్‌ సాయంతో చిన్నారికి హార్ట్‌ ఆపరేషన్‌

NQ Staff - November 18, 2022 / 10:18 AM IST

Mahesh Babu : కృష్ణ హార్ట్‌ ఎటాక్.. అదే సమయంలో మహేష్‌ సాయంతో చిన్నారికి హార్ట్‌ ఆపరేషన్‌

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో వేల చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన విషయం తెలిసిందే. ఆంధ్ర హాస్పిటల్ తో ఒప్పందం కుదుర్చుకుని మహేష్ బాబు వేలాది మంది చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడిన విషయం కూడా అందరికి తెలిసిందే.

అత్యధిక చిన్నారుల యొక్క గుండె ఆపరేషన్ కి సహాయం చేసిన స్టార్ గా మహేష్ బాబు రికార్డు సృష్టించాడు. అలాంటి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హార్ట్ ఎటాక్ తో మృతి చెందడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది.

సూపర్ స్టార్ కృష్ణ హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు సోమవారం.. అదే రోజు ఒక బాబుని ఆంధ్ర హాస్పిటల్ కి హార్ట్ ఆపరేషన్ కోసం జాయిన్ చేశారు. ఒకవైపు కృష్ణ గారి ఆరోగ్యం క్షమిస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలోనే మరో వైపు ఆ చిన్నారి బాబు యొక్క గుండెకి ఆపరేషన్ చేశారు.

కృష్ణ గారు మృతి చెందే సమయం కు చిన్నారి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యి.. బుడతడు బతికేశాడు. తండ్రి మృతి చెందుతున్న సమయంలో కూడా తన సాయంతో ఒక చిన్నారిని బతికించిన మహేష్ బాబు రియల్ సూపర్ స్టార్ అంటూ ఆయన అభిమానులు కీర్తిస్తున్నారు.

ఇక మహేష్‌ బాబు సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కిన విషయం తెల్సిందే. ఆ తర్వాత టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక యూనివర్శిల్‌ రేంజ్ మూవీని చేయబోతున్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us