Mahesh Babu: సూప‌ర్ స్టార్ స్టైలిష్ పిక్స్ కేక పెట్టిస్తుందిగా..!

Mahesh babu: కృష్ణ కుమారుడిగా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు. బాల నటుడిగానే మెప్పించిన అతడు హీరోగా మారి అద‌ర‌గొడుతున్నాడు. ఈ క్రమంలోనే హిట్లు మీద హిట్లు కొడుతూ హవాను చూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న మహేశ్ బాబు.. సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

Superstar Mahesh Babu Stylish Pics
Superstar Mahesh Babu Stylish Pics

కొరటాల శివ తీసిన ‘భరత్ అనే నేను’, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’, అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్‌ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేసి మార్కెట్‌ను పెంచుకున్నాడు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Superstar Mahesh Babu Stylish Pics
Superstar Mahesh Babu Stylish Pics

పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది.

Superstar Mahesh Babu Stylish Pics
Superstar Mahesh Babu Stylish Pics

ఈ చిత్రంలో మ‌హేష్ చాలా స్టైలిష్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా మ‌హేష్‌కి సంబంధించిన క్యూట్ పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ వ‌య‌స్సులోను మ‌హేష్ ఇలా ఉండ‌డాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. స‌ర్కారు వారి పాట చిత్రం త‌ర్వాత మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో సినిమాలు చేయ‌నున్నాడు.