ఇండస్ట్రీకి ధైర్యాన్నిచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ..!

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వైరస్‌ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 8 నెలల లాక్‌డౌన్ ఆంక్షలను విధించింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవినం స్థంభించిపోయింది. ఆర్ధిక రంగాలు కుదేలయ్యాయి. కూలీలు సైతం తమ ఉపాధిని కోల్పోయి.. గ్రామాల బాట పట్టారు. లాక్‌ డౌన ఆంక్షల నేపథ్యంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూతపడ్డాయి. సినిమా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా ఆ ఒడిదుడుకులను తట్టుకుని చిన్న చిన్న సినిమాలు ఓటీటీ లో విడుదల ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాయి.

How much Mahesh owns in AMB Cinemas?

అయినా సినీ ప్రియులు ఎప్పడెప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 4వ తారీఖు నుంచి సినిమా థియేటర్లు.. మల్టీప్లెక్స్‌లు తెరుచుకోనున్నాయి. 50 శాతం సీట్ల సామర్థ్యంలో థియేటర్లను రీఓపెన్ చేయమనడంతో యజమానులు అందుకు తగ్గట్టుగా అన్నీ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరికంటే ముందుగా టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఏఎంబీ మల్టీప్లెక్స్ రీ ఓపెన్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో సోషల్ మీడియా తో పాటు సినిమా ఇండస్ట్రీలోను ఈ న్యూస్ హాట్‌టాపిక్ గా మారింది.

గత ఎనిమిది నెలలుగా మూతపడిన ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ యాజమాన్యం ” ఇట్స్‌ టైమ్‌ ఫర్ యాక్షన్…వీ ఆర్‌ సెట్‌ టు ఓపెన్ డిసెంబర్ 4 ” అంటూ ఓ ప్రకటన విడుద చేసింది. దీంతో సినీ ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్లు మూతపడ్డ థియేటర్లు.. మళ్లీ ఓపెన్ అవబోతుండటంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ప్రేక్షకులే కాదు…సెలబ్రిటీలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన రాగానే యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌తో సహా పలువురు స్టార్లు… ఆనందం వ్యక్తం చేశారు. ఏఎమ్‌బీ అల్‌రెడీ సినిమా బుకింగ్‌లను కూడా ప్రారంభించేసింది. దీంతో మళ్లీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని సినీ వర్గాలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement